అడుగులు వేస్తే ఆనందం పరుగులు తీస్తే పరమానందం
ఎగిరిపోతే ఆకాశ తీర ప్రయాణ అనుభూతియే అపురూపం
నడకలు వేస్తే ఆరోగ్యం ఉరకలు తీస్తే ప్రయాసం
ప్రయాణం చేస్తే ప్రకృతి పర్యావరణ పరిశోధనం
పరుగుల ఆరాటం తీరే సమయం పరమైన ప్రశాంతం
ఉరకల ఆర్భాటం ఆగే తరుణం ఇహమైన ప్రశాంతం
జీవించు జీవి ప్రయాణ విధ మార్గమే ఒక అన్వేషణం || అడుగులు ||
అజ్ఞానంతో సాగినా విజ్ఞానంతో కొనసాగే ఎఱుకయే లక్ష్యం
అనర్థం సాగినా పరమార్ధంతో కొనసాగే హెచ్చరికయే ధ్యేయం
అసాధ్యంతో సాగినా అసాధారణ అనుభవమే సాధ్యం
అభ్యాసంతో సాగినా అసామాన్య అనుభూతియే సాక్ష్యం || అడుగులు ||
ఆచరణతో సాగినా ఆశ్రయించు ఆలోచనయే దైవం
ఆదరణతో సాగినా అనుకరించు యోచనయే సత్యం
ఆపేక్షతో సాగినా అనుసరించు అనురాగమే ఆనందం
ఆకాంక్షతో సాగినా అనుమతించు అనుబంధమే అమోఘం || అడుగులు ||

No comments:
Post a Comment