Monday, December 16, 2019

ఎంత నేర్చినా మేధస్సుకు విజ్ఞానం స్వల్పమే

ఎంత నేర్చినా మేధస్సుకు విజ్ఞానం స్వల్పమే
ఎంత ఎదిగినా దేహస్సుకు ప్రశాంతం అల్పమే

ఎంత ఒదిగినా మనస్సుకు మనోజ్ఞత స్వల్పమే
ఎంత చదివినా వయస్సుకు అభిజ్ఞత అల్పమే

ఎంతగా ఎదిగినా ఒదిగినా ఇంకా ఏంతో విజ్ఞానం మానవ మేధస్సుకు అవసరమే  || ఎంత ||

కాలం సమయానికి తెలిపే విజ్ఞానం అజ్ఞానాన్ని వదిలించుటకే
జ్ఞానం సందర్భానికి తెలిపే వేదాంతం అజ్ఞానాన్ని తొలగించుటకే

వేదం ఆలోచనకు కలిగే సమయం అజ్ఞానాన్ని విడిపించుటకే
శాస్త్రం యోచనకు కలిగే సందర్భం అజ్ఞానాన్ని నివారించుటకే  || ఎంత ||

భావం నవీనమైనా బంధంతో అజ్ఞానాన్ని మరిపించుటకే
తత్వం ఆధునికమైనా పంతంతో అజ్ఞానాన్ని మళ్ళించుటకే

దైవం అపూర్వమైనా సత్యంతో అజ్ఞానాన్ని ఖండించుటకే
ధర్మం అభిన్నమైనా గుణంతో అజ్ఞానాన్ని తరలించుటకే  || ఎంత ||

No comments:

Post a Comment