ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు నీవెవరివని ఎవరికి తెలుసు
ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు నేనెవరినని ఎవరికి తెలుసు
నీవెవరివని ఎవరికి తెలిసినా చేసేది ఏమీ లేదని తెలుసు
నేనెవరినని ఎవరికి తెలిసినా చేసేది ఏమీ లేదని తెలుసు
తెలిసి తెలియని వారెందరో ఉన్నా చేసేదేదో వారికే తెలుసు || ఎవరికి ||
తెలియకపోతే తెలుసుకోమంటారు తెలుసుకుంటే ఇంతేనా అంటారు
తెలిసినవారే తెలుపకపోతే తెలియని వారికి తెలిసేదెప్పుడు అంటారు
తెలుపుతున్నది తప్పని తెలిసినవారే తెలియదని ఎప్పుడు అంటారు
తెలుపుతున్నది ఒప్పని తెలిసినవారే తెలిసిందని ఎప్పుడు అంటారు
ఎప్పటికైనా మీరు మేము జీవించడం లేదంటారు
ఎప్పటికైనా మీరు మేము క్షమించడం లేదంటారు || ఎవరికి ||
తెలియనిది తెలుసుకోమని తెలియనివారే తెలుపుతుంటారు
తెలిసినది తెలుసుకోమని తెలిసినవారే తెలుపుతుంటారు
తెలియనివన్నీ తెలుసుకోవాలని తెలియనివారు తెలుసుకుంటారు
తెలిసినవన్నీ తెలుపుకోవాలని తెలిసినవారు తెలుపుకుంటారు || ఎవరికి ||
ఎప్పటికైనా మీరు మేము కలవడం లేదంటారు
ఎప్పటికైనా మీరు మేము మిగలడం లేదంటారు || ఎవరికి ||

No comments:
Post a Comment