Saturday, July 31, 2010

నా మేధస్సులో కాల చక్రము

నా మేధస్సులో కాల చక్రము ఉన్నంతవరకు భావాలు వస్తూనే ఉంటాయి
ఏ భావాలైనా కలగవచ్చు ఏ విశ్వ రహస్యాలైనా తోచవచ్చు కాలమే తోడుగా
కాల ప్రభావాలకు మేధస్సులో కలిగే భావాలే ఆలోచనలుగా విశ్వ విజ్ఞానమే
విశ్వ విజ్ఞానమున కాల చక్రము ఎన్నో రహస్యాలను మేధస్సున అన్వేషిస్తున్నది

నా భావాలకు నేనే స్పూర్తిని నేనే కర్త

నా భావాలకు నేనే స్పూర్తిని నేనే కర్త కర్మ క్రియ కాల ప్రభావాన్ని
నా భావాలన్నీ శూన్యార్థమైనా ఓ విశ్వ భావన అంతులేనిది
ఆ భావనను గ్రహించుటకే ఎన్నో భావాలను తెలుపుతూనే ఉన్నా
పరమాత్మయే తలచిన ఆది భావన సృష్టికే స్పందన కిలిగించినది

నా భావాలను వేరే వారి నుండి ఎప్పుడు

నా భావాలను వేరే వారి నుండి ఎప్పుడు గ్రహిస్తానో విశ్వమున వేచివున్నా
నా భావాలు గొప్పవైతే విశ్వమున ఎప్పుడూ నన్ను చేరుతూ ఉంటాయి
నన్ను చేరే భావాలు మహా విజ్ఞానాన్ని తెలిపే భావనలేనని నా ఆలోచన
నా భావాలు నన్ను చేరుటలో అజ్ఞానాన్ని తొలగించగలవని ప్రఘాడ విశ్వాసం

నా భావాలను చదువుతూ

నా భావాలను చదువుతూ లీనమైపోయారంటే అనారోగ్యమైనా నశిస్తుందేమో
నా భావాలను తెలుసుకుంటూ నిద్రిస్తున్నారంటే ఆరోగ్యంగా ఉంటారనే
నా భావాలతో ఆత్మ జ్ఞానం చెందుతున్నారంటే కాలాన్ని అర్థం చేసుకోవాలి
కాల ప్రభావాలను కూడా అర్థం చేసుకోవాలంటే నా భావాలు మేధస్సుననే ఉండాలి

నేను తెలిపే భావాలలో హాస్యము

నేను తెలిపే భావాలలో హాస్యము ఉందంటే అందులో పరమార్థమెంతో
హాస్యముతో ఆరోగ్యంగా విజ్ఞానాన్ని చెందాలని నా హాస్యార్థ భావనయే
హాస్యము హర్శధ్వనులతో దేహాన్ని కదిలించే బహు భావ స్వభావమే
రోగమును వీడే కణాలకై హర్శధ్వనులు దేహాన లేకపోతే శరీరమే నశించెను

కాలము కొందరికి కొన్ని గడియలే

కాలము కొందరికి కొన్ని గడియలే అవకాశాన్ని కలిపిస్తుంది
ఆ గడియలలో సంపూర్ణ విజ్ఞానాన్ని కలిగించలేమని తెలుస్తుంది
మరల కొన్ని గడియలలో వాటిని నెమరు వేసుకుంటే గాని అర్థం కావు
మూలం తెలియని విజ్ఞానం మూల పడిందని విశ్వమున మహా రహస్యం
మూలం తెలిసే విధంగా ఆత్మ జ్ఞానం చెందండి లేదంటే ధ్యానించండి

కాలము భావాలను తెలుపుటకు

కాలము భావాలను తెలుపుటకు కూడా అవకాశాన్ని కలిపించుట లేదు
ఎన్ని భావాలు నాలో ఉన్నాయో నాకే తెలియని విధంగా కలుగుతున్నాయి
నా భావాలను నేను తెలుసుకొనుటకు కూడా అవకాశం లేకుండా పోతుందేమో
నా భావాలు నాకు అర్థమవుతున్నట్లు మరెందరికో అర్థం కావటం లేదేంటే కాలమేనా
నేను లేనప్పుడు నా భావాలు అర్థమైతే పరమార్థాన్ని గ్రహించే కాలం ఎలాంటిదో

అనారోగ్యం చెందినా విశ్వ భావాలు

అనారోగ్యం చెందినా విశ్వ భావాలు తెలుపుటలో సామర్థ్యం ఉన్నది
ఆహారం ఇష్టం లేకున్నా భావాలు గొప్పగా కూడా కలుగుతాయి
ఏ చికిత్స లేకున్నా ఆత్మ భావాలు సంతృప్తిని కలిగిస్తున్నాయి
నాకు ఇష్టమైనది ధ్యానం అదే నా రహస్య భావాల ఆత్మ జ్ఞానం
చలనం లేకుండా కలిగే ఆత్మ సంతృప్తియే ధ్యానమున శ్వాస తెలిపిన మర్మం
ధ్యానమున రోగము వదిలిపోయేనని శ్వాస గమనంతో లీనమైతే తెలుస్తుంది

విశ్వమంతా చెవిలోనే ఉన్నది

విశ్వమంతా చెవిలోనే ఉన్నది
విశ్వ రూపాలన్నీ నేత్రముననే ఉన్నవి
విశ్వ ఆత్మలన్నీ నాసికమున ఉన్నవి
విశ్వ భావాలన్నీ మనస్సులో ఉన్నవి
విశ్వ స్వభావాలన్నీ మేధస్సులో ఉన్నవి
సూక్ష్మంగా ఆలోచిస్తేనే అర్థంగా ఉంటాయి

రోగంతో ఉన్నవారి నరాలను కదిలించే

రోగంతో ఉన్నవారి నరాలను కదిలించే సంగీతాన్ని సృష్టించండి -
రోగాలు నశించి పోయేలా సంగీత సమ్మేళనాన్ని ఏర్పాటు చేయండి -
నాద వినోదం కన్నా స్వరారోగ్యాన్ని ప్రతి జీవికి అందించండి -
ఎటువంటి సూక్ష్మ అభ్యంతరము లేకుండా ఒక గడియయైనా సంగీతాన్ని అందించండి -
సంగీతాన్ని వింటుంటే మనిషి కోమాలో ఉన్నాడా లేదా మరణించాడా అనేటట్లు ఉండాలి -
ధ్యానిస్తూ సంగీతాన్ని వింటుంటే కైలాసమున శివుడు చలించి తన ఆత్మలో లీనమవ్వాలి -
సంగీతంలోని అద్భుతాలు విశ్వ రహస్యాలుగా విశ్వమందే దాగి ఉన్నాయి -
సంగీతాన్ని ఎక్కువ ధ్వని లేకుండా ఎవరైతే ఆరోగ్యంగా కదిలిస్తారో వారే విశ్వ వైద్యులు -

నన్ను అర్థం చేసుకోలేనివారే నా వారు

నన్ను అర్థం చేసుకోలేనివారే నా వారు నా ఆత్మీయులు
నన్ను అర్థం చేసుకున్న వారు నా గురువులు మిత్రులు
నా అర్థాన్ని గ్రహించిన వారు మహా వేద విజ్ఞానులు
నా అర్థాన్ని తెలిపే వారు భావ ధ్యాన స్వరూపులు

శోచాలయమే నాకు సంతోషాలయము

శోచాలయమే నాకు సంతోషాలయము
స్వచ్ఛత శ్రామికులే నాకు గొప్ప వారు
ఇష్టంతో నిద్రించిన స్థానమే దేవాలయము
అజ్ఞానం చెందిన ప్రాంతమే ఆశుభ్రతమైనది
మనిషిలో ఆహార వ్యవస్థ ఉన్నంతవరకు పైవన్నీ ముఖ్యమైనవి
నేను ధ్యానించిన ప్రశాంత సమయమే బ్రంహా మూహూర్తం

విశ్వమున నీ రూపము మరల

విశ్వమున నీ రూపము మరల జన్మించవచ్చు
ఇంతకు ముందు కూడా జన్మించి ఉండవచ్చు
ఆశయ భావాలు మాత్రం వేరుగా ఉంటాయి
రూపాన్ని చూసి భ్రమ పడవద్దు ఆకారాన్ని చూసి చలించవద్దు
విజ్ఞాన సమయస్పూర్తితో నీ కార్యంలో నిమగ్నమై ఉండు

నేనెవరిని అని నన్నెవరైనా అడిగినా

నేనెవరిని అని నన్నెవరైనా అడిగినా తలచినా ఊహించినా
విశ్వమున చలించే జీవమున తొలి భావ బాల మేధస్సును నేనే
చలించుటలో ప్రయాణము అవసరం లేదు కదలిక ఉంటే చాలు
పంచ భూతాలతో నిర్మితమైన ఏదైనను నా భావనతో ఆరంభం

కాలాన్ని ప్రేమిస్తున్నా కాల ప్రభావము

కాలాన్ని ప్రేమిస్తున్నా కాల ప్రభావము నన్ను వెంటాడుతున్నది
నా భావనతో మొదలైన క్షణమే కాల ప్రభావంతో వెంటపడుతున్నది
ఆనాడు నా భావన లేకపోతే కాలమే లేదు విశ్వ మైనను లేదు
విశ్వ ప్రభావాలు నాకొక లెక్కని నేను ఆలోచిస్తే అర్థం ఎవరికి తెలియును
ఇంకా నాలో అర్థం కాని భావ స్వభావాలు అనంతముగా దాగి ఉన్నాయి

నేను మరణిస్తే ఇక లేనని ఎప్పుడూ

నేను మరణిస్తే ఇక లేనని ఎప్పుడూ తలచవద్దు
నీలి ఆకాశమే నేనని మీయందు ఎప్పటికీ ఉంటా
నా సందేశ భావాలను మేఘాలతో తెలుపుతుంటా
మేఘాలలో నా అద్భుత రూప భావాలు క్షణానికి ఎన్నో

ఎక్కడ నుండి విజ్ఞాన ఆరోగ్యాన్ని

ఎక్కడ నుండి విజ్ఞాన ఆరోగ్యాన్ని సంపాదించాలి
విశ్వమున ఏ ప్రాంతాన సూక్ష్మంగా అన్వేషించాలి
మేధస్సు చీకటైపోతున్నది ఆలోచనలు ఆందోళన చెందుతున్నాయి
భావాలు ఆత్మలో లీనమైపోతున్నా స్వభావాలు శ్వాసను చెదురుతున్నాయి

బహుషా నా భావాలు విశ్వమునకు

బహుషా నా భావాలు విశ్వమునకు అర్థం కావేమో
అందుకే నా ఆత్మకు కాల విధి ప్రభావ పరిస్థితులు
ఏ పరిస్థితులైనా కాలమే నా భావాలకై మారగలదు
మారిపోయే కాలానికి నా భావాలే నిలిచిపోవును

విశ్వమునకు నా భావాలు అర్థమైతే

విశ్వమునకు నా భావాలు అర్థమైతే కాల ప్రభావాలు నాకు సహకరిస్తాయని
అనారోగ్యం కలగరాదనే అజ్ఞానం చెందకూడదని ఆరోగ్య విజ్ఞానంతో వేడుకుంటున్నా -
ప్రతి మనిషికి ఆరోగ్యమే వివిధ కార్యాల ఆహార వృత్తి జీవన విధానాలని తెలుపుతున్నా -
విశ్వ కాలము మీకు తోడుగా ఐశ్వర్య ఆరోగ్యాలను కలిగించాలని విజ్ఞానాన్ని కోరుకున్నా -

కాల ప్రభావాలను జీర్ణించుకునే ఆత్మ

కాల ప్రభావాలను జీర్ణించుకునే ఆత్మ భావాలే నాకు మేధస్సున కలగాలని అన్వేషిస్తున్నా -
కాల ప్రభావాలకు నిలవలేని శరీరం అనారోగ్యంతో ఆవేదన చెందుతూ తపిస్తూనే ఉంటుంది -
కాల ప్రభావాలకు నిలిచే శరీర దేహం ఆత్మ జ్ఞాన ధ్యానమున పొందవచ్చని నా వేద భావము -
ఆధ్యాత్మ జీవితాన ఏ ప్రభావాలైనా జీర్ణించుకొని విశ్వ విజ్ఞానంతో జీవించవచ్చని నా దివ్యాలోచన -

ఆరోగ్యంగా ఉన్నప్పుడు విశ్వమంతా

ఆరోగ్యంగా ఉన్నప్పుడు విశ్వమంతా కావాలని అనారోగ్యంగా ఉన్నప్పుడు శూన్యము కూడా వద్దని -
మరణమైనా చాలు నా మేధస్సుకు అనారోగ్యాన్ని మాత్రం కలిగించకని విశ్వ కాలాన్ని ప్రార్థిస్తున్నా -
మరణాన్ని కోరుకోవటంలో ఆత్మ ఆవేదన ఎలాంటిదో మేధస్సుకు కూడా అర్థంకాని అన్వేషణగానే -
జీవితాన్ని అర్థం చేసుకొని ఆరోగ్య విజ్ఞాన జీవితాన్ని సకాలంలో సాగించమని నా భవిష్య సందేహము -

రోగాన్ని కదిలించు లేదంటే

రోగాన్ని కదిలించు లేదంటే అనారోగ్యంతో మరణిస్తావు
రోగాన్ని ఆరోగ్యంగా మార్చే ఆలోచనలతో జీవించు
ఆలోచనలతో ఆరోగ్య సాధనను శ్రమైనా సాగించు
రోగం నశించి పోయేవరకు ఆరోగ్య సాధనను వదులుకోవద్దు
మేధస్సుతో పాటు శరీరము కూడా సహకరించకపోతే
ఆత్మ జ్ఞానంతో ధ్యానించేందుకు శ్వాసపై గమనాన్ని కేంద్రీకరించు

Friday, July 30, 2010

మనిషికి అవకాశము కన్నా వరమే

మనిషికి అవకాశము కన్నా వరమే గొప్పదని భావిస్తున్నా
అదృష్టాన్ని మించినది వరమేనని నా మేధస్సులోని భావన
శ్రమించినా విజయం లేకపోతే అదృష్టం లేదనే తెలుస్తుంది
శ్రమించకపోయినా విజయం పొందితే అదృష్ట వరమే కదా
అదృష్టం ఉంటే కాలమే విజయం కోసం అవకాశాన్ని కల్పిస్తుంది
మనం ప్రయత్నించుటలో కాలమే మన మేధస్సును మార్చుతుంది

ఆత్మలో చలి ప్రవేశిస్తే శరీరము

ఆత్మలో చలి ప్రవేశిస్తే శరీరము తూగుతూనే ఉంటుంది
తటస్థమైన శక్తి శరీరానికి లేకుండా అనారోగ్యాన్ని కలిగిస్తుంది
చలికి వర్షం తోడైతే ఆత్మ ఏ కార్యాన్ని చేయలేక పోతుంది
నిద్రించాలన్నా ఏకాగ్రత కలగని విధంగా మేధస్సులో ఆలోచనలు
ఆలోచనలతో ఆవేదనలు ఎక్కువై ఏకాగ్రత లేక ఆత్మకు శాంతి లేదు

ఆత్మ జ్ఞానంతో శ్వాసిస్తే నాసికమున

ఆత్మ జ్ఞానంతో శ్వాసిస్తే నాసికమున ఉచ్చ్వాస నిచ్చ్వాసలు ఆగినట్లే
ఆత్మయే విశ్వమున లీనమై దేహమున సూక్ష్మమై శ్వాసిస్తూ ఉంటుంది
ఆత్మ శూన్యత్వాన్ని కలిగి ఉంటే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు భావాలతోనే
ఆత్మ జ్ఞాన ధ్యానమున విశ్వమే శాస్వగా దివ్య భావనతో జీవిస్తుంది

మనిషి పుట్టుకలో కృత్రిమ మార్పులు

మనిషి పుట్టుకలో కృత్రిమ మార్పులు ఎక్కువైతే మరో అవతార కాలం వస్తుందేమో
సహజానికి కృత్రిమానికి కాల ప్రభావాలు విరుద్దమైతే సమాజం తలక్రిందులవుతుందేమో
నేటి సమస్యలకు పరష్కారం లేకపోతే భవిష్య సమస్యకు ఏ కారణాలు పరిష్కారమవుతాయి
కారణాలు సహజత్వ పరిష్కారమైతేనే ప్రతి జీవిలో అనుకూలమైన శరీర రూప ఆకారాలు
సహజత్వానికై ప్రతి రోజు ధ్యానించండి మీ జీవితాలు విజ్ఞాన పరిష్కారంతో సాగుతాయి

అనారోగ్యంతో కూడా మనిషిలో

అనారోగ్యంతో కూడా మనిషిలో ఓ విధమైన మహా మార్పు కలుగుతుందని భావిస్తున్నా -
కాల ప్రభావము మనకు దేనిని తెలుపుతుందో గ్రహించుటకు ఓ అవకాశమే అనారోగ్యం -
శరీరంలో మేధస్సుకు రోగం లేకపోతే ఏ రోగాన్నైనా వదిలించుకోవచ్చని నా దివ్య విజ్ఞానం -
మేధస్సులో లోపించినా మరో జీవి అతనికి ధ్యాన భావనను కలిగిస్తే మేధస్సు మహా వృక్షమే -
ధ్యాన భావన మహా రోగానికి దివ్య ఔషధంగా పని చేస్తుందని భవిష్య కాలమే తెలుపుతుంది -
సూక్ష్మ జ్ఞాన ధ్యాన భావ విశ్వ విజ్ఞాన ఆత్మ ఎరుక కలవారు రోగాన్ని అనుభవముగా స్వీకరిస్తారు -
ఆధ్యాత్మ మహాత్ములకు రోగములు విజ్ఞాన పాఠాలుగా మేధస్సున భోధనమవుతూ ఉంటాయి -
నేను నేర్చిన విజ్ఞాన పాఠాలు విశ్వమున కాల ప్రభావాలుగా క్షణానికి ఎన్నో ఆత్మకే ఎరుక -

ఆత్మ జ్ఞానం చెందవా నీ విజ్ఞాన

ఆత్మ జ్ఞానం చెందవా నీ విజ్ఞాన ఆవశ్యకత విశ్వానికి ఎంతో అవసరం
ఎన్ని విధాల ఆలోచించినా నీ ఆత్మ జ్ఞాన విజ్ఞానమే విశ్వానికి ఆవశ్యకత
నీ మేధస్సులోని ఆలోచనలు నిన్ను మాయ చేసి నీ విజ్ఞానాన్ని దాచేశాయి
మనస్సును ఆత్మ భావనలో కేంద్రీకరిస్తే నీ విశ్వ విజ్ఞానం అద్వితీయం

వినిపిస్తుందా నీ ఆత్మ ఆవేదన

వినిపిస్తుందా నీ ఆత్మ ఆవేదన విశ్వానికి తెలిసేలా
అనారోగ్యంతో మరణాన్ని పదే పదే తిలకిస్తున్నావా
నిమిషమైనా నిద్రలేక క్షణమైనా ఆత్మ తృప్తి లేదే
ఆరోగ్యం కోసం తపించుటలో శ్వాసతో ధ్యానించలేవా

విశ్వమున పగటి మేఘాలతో

విశ్వమున పగటి మేఘాలతో సూర్యుడు కనిపించకపోయినా
నా మేధస్సులో సూర్యుని తేజ కిరణము ప్రకాశిస్తూ ఉండాలని
సూర్యోదయము నా మేధస్సులో నిత్యం కలుగుతూనే ఉన్నది
నా మేధస్సున సూర్య తేజము లేకపోతే అనారోగ్యంతో ఉంటా
ఏనాటికీ నాలో సూర్య భావన కలగకపోతే నే అస్తమించేనట్లే
విశ్వమున నేను లేని క్షణం మేఘాలతోనే ఉంటుందని నిదర్శనం
నిత్యమూ ఉత్తేజమునకై మేధస్సులో దివ్యాలోచన ఉండాలని
ఆత్మ జ్ఞానం చెందవా నీలోని శ్వాసే నీకు విశ్వ శక్తిగా ఉన్నది
విశ్వము నీలోనే ఉందని శ్వాసను నిత్యమూ గమనించు విశ్వమా!

రోగాలు రాళ్ళ వలె కరిగే ధ్యాన

రోగాలు రాళ్ళ వలె కరిగే ధ్యాన సంగీతాన్ని వినిపించండి
ఆత్మ కూడా లీనమయ్యే సంగీత నాదాన్ని పలికించండి
సంగీతంతో అనారోగ్యాన్ని తొలగించే వేద భావాన్ని అన్వేషించండి
అన్వేషణలో సంగీత నాదాలు దేహాన్ని కదిలించేలా లభిస్తాయి
విశ్వమున ధ్యాన సంగీత నాదం ఆరోగ్య విజ్ఞాన జీవిత సందేశం

రోగ బంధాలను వదిలించే ఆత్మ

రోగ బంధాలను వదిలించే ఆత్మ ప్రశాంతత ఎక్కడుందో తెలుసుకోండి
దేహంలో దాగిన సూక్ష్మ రోగాలను కణాలతో సహా తొలగించుకోండి
ప్రకృతిలో దాగిన ప్రాణ వాయువు మీ రోగాన్ని వదిలించటం లేదా
ప్రకృతిలో ధ్యానిస్తూ మీ శ్వాసను ఆత్మానంద ఆరోగ్యంగా జీవింపజేయండి
శ్వాసలోని గాలికి విశ్వమున ప్రకృతిలో సహజ వాయువు సరి జోడి

మనస్సుకు ఏ పనైనా కష్టతరమనిపిస్తే

మనస్సుకు ఏ పనైనా కష్టతరమనిపిస్తే వెనుకడుగు వేయుటకు ప్రయత్నిస్తుంది
మేధస్సున కార్య సామర్థ్యాన్ని కొలిచే విజ్ఞాన భావన మనస్సులో లేకపోతే సందేహమే
సందేహంతో పనిచేస్తే ఏ కార్యము సంతృప్తిగా పూర్తి కాలేకపోవచ్చని నా ఆలోచన
మనస్సు అన్వేషణతో కార్యాన్ని సాగిస్తే సామర్థ్యం సమర్ధతగా ఉంటుందని నా భావన
విజ్ఞాన అనుభవం ఉన్నంత వరకు శ్రమించడం తెలిస్తే కాలమే ముందడుగు వేయిస్తుంది

పాతాళమున నీళ్ళు తరుగుతున్నా

పాతాళమున నీళ్ళు తరుగుతున్నా ధరిణిపై జన సంఖ్య పెరుగుతూనే ఉన్నది
నీళ్ళు కరువైతే జీవన విధానంలో శుభ్రత జీవిత మార్పులు మరో విధంగా ఉంటాయి
జీవనాన్ని అశుభ్రతతో సాగించే వారు ఎక్కువై దివ్య భావాలు తెలియకుండాపోతాయి
సూక్ష్మ శుభ్రత లేక జీవితం మరో కోణంలో ఆవశ్యకమై ముఖ్య అవసరాలే ప్రధానమౌతాయి
దివ్య భావాలు మహాత్ముల మేధస్సులో ఉన్నా జీవించుటకు వీలు కాకుండా పోతుంది
నా భావాలు ఎంతటివో కాంతి తత్వ స్వభావాలు కూడా గ్రహించని సూక్ష్మ శుభ్రతతో ఉంటాయి

రోగాన్ని వదిలించే మహా భావనలకై

రోగాన్ని వదిలించే మహా భావనలకై విశ్వమున అర్ధ రాత్రిలో అన్వేషిస్తున్నా
మహా గుణ కాల సమయంలో దివ్య జ్ఞాన ఔషధాల భావాలను సేకరిస్తున్నా
విశ్వమున ఏ అణువుకు మెలకువ లేనప్పుడు మర్మ ధ్యాసలో గ్రహిస్తున్నా
నక్షత్ర కాంతులతో మెరిసే జీవ కణాలను శ్వాసలో ఔషదంగా జీవింపజేస్తున్నా
నా మేధస్సులోని ఔషద భావాలను తెలిపితే రోగాలే ఏకాగ్రతలో నశించెను
అజ్ఞానం లేని మేధస్సులో నా భావాలు దివ్య మౌలిక స్వచ్ఛత కాంతి ఔషదాలే

Thursday, July 29, 2010

Bill Gates - Microsoft

Bill Gates developed OS for a system/computer -
The systems/computers are opened by 'Windows OS' -
He don't know how many systems are using Windows OS in the entire World -
But for all the Systems(opened by OS) 'Windows OS' is only one of the Gate's -
Entire the world Bill Gates is so popular by Windows OS -
Without Windows operating system(OS) we can't handle/run the system -
* He observes very soft and also thinks micro talented ie Microsoft -
He will give the Windows product as easy way to understand the Users and also running a Systems/Computer -
Microsoft software’s are mega sales always in the World -
He is having millions of dollars and also throughout the world Windows OS runs in millions of systems -
Some people working in Microsoft company, they feel as great -
Any have I always congrats to Bill Gates for any new product of Microsoft -

Monday, July 26, 2010

Terminology

Terminology
You can understand / learn anything as easy by terminology -
You learn terminology then you can survive the entire world easily -
Just you know the basics and the way / representation of the terminology -
You can go any field everything(basics) is same but the terminology will differ -
basics are numbers, alphabets, arithematic / logical / relationship symbols, and so on -
Other basics : way of writing(Written), reading vocabulary (Oral) in different ways -
Different ways it means different areas : communication, society, Industries, Services, Technology, BPO etc., -
Education is the basic thing of general knowledge as well as to know the subject / skill and also communication -
You can understand the terminology, you learn any subject easily and also score -
Every field having the same basics and they modify similar changes for every one should feel good and easy -
The man can understand polite and with in the time should notice as simple as possible -
In Software Technology the code is written by terminology of machine understandable and also some concepts, procedures, methods, fuctions, relationships so on -
In Computer / Notepad / Mobile the tools are different to organize the business and also personal by terminology -
In working area the words are using either work or person to communicate do not feel as disability, It should be generic -
The mails also simple and short forms also generic meaning -
The way using the knowledge in any way, the terminology says it should be polite always to all (no one can point out) -
Terminology means everyone should obey and polite (It should be meaningful) -

The behavior terminology is very important -

Saturday, July 24, 2010

అప్పుడు వచ్చిన వారు జీవించి

అప్పుడు వచ్చిన వారు జీవించి అలాగే వెళ్ళిపోయారు
ఇప్పుడు వచ్చేవారు అలాగే జీవించే అలానే వెళ్ళిపోతున్నారు
ఎప్పుడో జీవించి ఎప్పుడో భవిష్య కాలమున కూడా అలాగే వెళ్ళిపోతారు
అందరూ అలాగే ఒకరితో ఒకరు విశ్వ విజ్ఞానము లేక వెళ్ళిపోతే
విశ్వమున ఎన్ని వేల కోట్ల జీవములు వచ్చినా ప్రయోజనం లేదు
విశ్వ విజ్ఞానముతో ఆధ్యాత్మంగా జీవిస్తేనే సరైన జనాభాతో సక్రమంగా ఉంటుంది
ఎక్కువ జనాభాతో అజ్ఞాన సమస్యలను పెంచుకుంటూ విశ్వ విజ్ఞానాన్ని మరచిపోయాం -
నేటి నుండైనా విశ్వ విజ్ఞానముకై భవిష్య జనులకైనా తెలిసేలా జీవించాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

కొన్ని భావాలను అప్పటికప్పుడు

కొన్ని భావాలను అప్పటికప్పుడు మాటలలో చెప్పలేను
మాటలలో విశ్వ భావాలను స్వీకరించే ఏకాగ్రత ఉండదు
కొన్ని సందర్భాలలో కొన్నింటిని మాత్రమే తెలుపగలను
ఏకాగ్రతగా ఆలోచించి ఎన్నో వ్రాయగలనని తెలిపెదను
నా మాటలలో గ్రహించలేనిది నేను వ్రాసిన వాటితో తెలుకోవాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

ఆచార వ్యవహారాలలో సంతృప్తి

ఆచార వ్యవహారాలలో సంతృప్తి కలగలేదంటే
మానసిక విశ్వ ప్రశాంతతకై ధ్యానించండి
ఏకాగ్రత ధ్యాసతో శ్వాసను సూక్ష్మంగా గమనిస్తే
మీలో కదలిక లేక మనస్సు ఆలోచనలను వదిలి
ఆత్మ పై కేంద్రీకృతమై విశ్వశక్తి మీలో ప్రవేశిస్తుంది
తద్వారా మీలోని అనారోగ్యం నశించి సద్గుణాలు కలుగుతాయి
ఆపై విశ్వ భావ స్వభావాలు మీ మేధస్సును విజ్ఞానపరుస్తాయి
విశ్వ విజ్ఞానంతో ఆత్మ ప్రశాంతతను పొంది ఆధ్యాత్మ జీవితాన్ని సాగిస్తారు
విశ్వ చైతన్యంతో విశ్వ కార్యాలతో ప్రశాంతంగా జీవించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

విశ్వమున పడమర దిక్కున మహా

విశ్వమున పడమర దిక్కున మహా తేజస్సు నక్షత్రమునై
తూర్పున ఉదయించే మహా చంద్ర బింభాన్ని తిలకిస్తున్నా
నక్షత్రముగా ధ్యానిస్తూ చంద్రుని వెన్నల కాంతిని మేధస్సున గ్రహిస్తున్నా
శిరస్సు పై విశ్వ సువర్ణ కమలము వికసించి దివ్య జ్ఞానము చేరుతున్నది
ఆధ్యాత్మగా ఎదిగే నక్షత్రముగా మీలో విశ్వ తేజ విజ్ఞానము కలగాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

నేను ఈ క్షణం ఇక్కడ మీతో ఉన్నా

నేను ఈ క్షణం ఇక్కడ మీతో ఉన్నా
ఇదే క్షణాన మరో ప్రాంతాన మరో చోట కూడా నేను ఉంటా
ఎన్నో ప్రాంతాలలో ఎన్నో విధాల నేనే ఉన్నా
విజ్ఞాన విశ్వ భావాలు ఎక్కడైతే వికసిస్తుంటాయో
ఆ ప్రాంతాలలో నేనే విశ్వ రూపాలతో ఉంటా
నా శరీరాత్మలో ఎన్నో విశ్వ రూపాత్మలు దాగి ఉన్నాయి
మీలో ఉన్న విశ్వ రూపాత్మలను తెలుసుకోవాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

ఒకే కుటుంబములో ఉన్న వారమే

ఒకే కుటుంబములో ఉన్న వారమే మేమంతా
అందరికి పెళ్ళిళ్ళు ఐన తర్వాత ఎవరికి వారు
భార్యా భర్తలుగా ఒక్కొక్క ఇంటిలో నివసిస్తున్నాము
నా సోదరుల ఇంటికి వెళ్ళితే నేను అతిధినేనని
వారు నా ఇంటికి వస్తే అతిధులేనా అనిపిస్తుంది
నా వారు నాతో విడిపోయారా అనే భావన కలుగుతుంది
పెళ్ళితో తల్లిదండ్రులు కూడా వస్తే అతిధులేమోననిపిస్తుంది
కాలము ఎలా మారుతుందో తోటి మనిషిని కూడా వేరు చేస్తుంది
విశ్వ జీవిత జీవన భావనలు అర్థం కావాలంటే పరమార్థమే తెలియాలి
అందరూ మన ఆత్మీయులే అనే భావనతో జీవించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

ఆధ్యాత్మ జీవితం కావాలి ప్రభూ!.....

ఆధ్యాత్మ జీవితం కావాలి ప్రభూ! ..... నాకు నీవే శరణ్యం
నా జీవితం సుడి గుండాలతో నిండిపోయి నేను మునిగిపోతున్నా
నాసికము తేలుటతో శ్వాస తీసుకుంటున్నా లేదంటే మరణమే
మరణాన్ని జయించిన నాసికమునందే అమృత శ్వాస ఉన్నది
శ్వాస నీయందునే ఉంటే నేనెలా ఆధ్యాత్మ జీవితాన్ని ఇవ్వగలను
నీ శ్వాసతో నీవే గమనిస్తూ ధ్యానిస్తే ఆధ్యాత్మ జీవితం ఆరంభమగునని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

విశ్వ విజ్ఞానం నాలో చలిస్తున్నంత

విశ్వ విజ్ఞానం నాలో చలిస్తున్నంత వరకు నేను ఆత్మ ధ్యాసలో
నా ఆత్మ ధ్యాసకు ఎన్నో సమస్యలు భంగం కలిగిస్తూనే ఉన్నవి
విశ్వ విజ్ఞానం ఉన్నా మన ఆత్మ ధ్యాసకు భంగం కలగరాదంటే
మన ఆధ్యాత్మ విజ్ఞానాన్ని విశ్వమంతా తెలుసుకోవాలి కనుక
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

నీవు మహా ఆనంద సంతోషంగా

నీవు మహా ఆనంద సంతోషంగా ఉన్నప్పుడు
కొన్ని వేల లక్షల కోట్ల మైళ్ళ దూరం నుండి
దుఖ్ఖాల సాగరం నిన్ను ముంచేయడానికి వస్తుందేమో
సుఖంలో అజ్ఞాన స్పృహ లేక విజ్ఞాన ఎరుకతో ఉంటే
సాగరమైనా నీ మేధస్సులో అణువుగా చేరిపోతుంది
ఆత్మ ఎరుకతో జీవిస్తున్నంతవరకు అంతా తెలియునని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

విశ్వ విజ్ఞానంతో నిద్ర లేవండి

విశ్వ విజ్ఞానంతో నిద్ర లేవండి ఆధ్యాత్మ జీవితాన్ని ఆరంభించండి
ధ్యాన సాధనతో మనో విజ్ఞాన మేధస్సును విశ్వమంతా పరచండి
మీ మేధస్సు విశ్వ విజ్ఞానాన్ని కలిగి ఉన్నదని మీకు తెలియకనే
ప్రాపాంచిక సమస్యల వలయంలో జీవితాన్ని సాగిస్తూనే ఉన్నారు
ఆధ్యాత్మ జీవితమునకై విశ్వమున మహా ప్రయాణాన్ని సాగిస్తూ
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

విశ్వమున ఎవరు గొప్పని

విశ్వమున ఎవరు గొప్పని విశ్వనాధుడు ముల్లోకాలలో అన్వేషిస్తున్నాడు
నా వలె ధ్యానించే మరో విశ్వనాధుడు నాకన్నా గొప్పగా సాధన చేస్తున్నాడా
నా కైలాస శిఖరమున లేని ప్రకంపనలు అతని ఆత్మలో కలుగుతున్నాయా
విశ్వమున ఎక్కడలేని మహా దివ్య ప్రకంపనలు మన ఆత్మలో కలగాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

ఆధ్యాత్మ జీవితం నేటి కాలమున

ఆధ్యాత్మ జీవితం నేటి కాలమున ప్రారంభమైనది
ఆనాడు ఋషులు యోగులు మాత్రమే చేసేవారు
నేడు ప్రతి జీవికి ప్రతి క్షణం అవసరమైన జీవితం
ఆధ్యాత్మ జీవితం గురించి తెలిసిన వారు అరుదుగా ఉన్నా
తెలుసుకుంటున్న వారు విశ్వమున వందల కోట్లలో
ఆధ్యాత్మ జీవితం లేకపోతే జీవించలేమన్నట్లు
విశ్వమంతా ఎందరో ప్రశాంతతకై అన్వేషిస్తూనే ఉన్నారు
మీలో ఆధ్యాత్మ జీవితం ఆరంభం కావాలంటే ధ్యానంతో
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

నా జీవితము విశ్వమున ఏ గ్రహానికి

నా జీవితము విశ్వమున ఏ గ్రహానికి అర్థమవుతున్నది
ఏ గ్రహచార దోషాలు నా మేధస్సును వెంటాడుతున్నాయి
నా ఆశయాలు తీరని విధంగా లేదా నాలో విజ్ఞానం లేదా
విశ్వ కాలమునకైనా నా జీవిత విధానము తెలుసో లేదో
విశ్వమున నా మేధస్సు స్థితి ఏ రూపానికి అర్థంగా తెలిసినా
నా జీవితము విశ్వమున రూప భావనయేనని భావిస్తున్నా
మీ జీవితము ఎవరికి తెలియునో నీకు తెలియకపోయినా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

నా హాష్యమున విశ్వ భాష

నా హాష్యమున విశ్వ భాష దాగి ఉన్నది
ముఖములో హాష్యమున్నా భావనలో
ఎన్నో ప్రాపంచిక స్వభావాలు దాగున్నాయి
ఎవరికి తెలియనంతగా విశ్వ స్వభావాలు
నా మేధస్సులో ప్రతి క్షణం కలుగుతూ ఉంటాయి
నా రూప విశ్వ స్వభావాలను గుర్తించాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

Friday, July 23, 2010

విశ్వమంతా అనంత ముఖాలతో

విశ్వమంతా అనంత ముఖాలతో ఆదిశేషుడనై ఆకాశమై ఉన్నా
అంతరిక్షమున ఉన్న నా రూపాన్ని మీకు కనిపించే ఆకాశం కప్పి ఉన్నది
నేను లేని విశ్వము అఘోర ప్రళయాలకు భయ భ్రాంతులు చెందుతుందని
విశ్వ రక్షణకై అంతరిక్షమున విశ్వాస ప్రాప్తిగా శూన్య భావనతో ఉన్నా
ఏ ప్రళయాలకైనా భయ భ్రాంతులు మీకు కలగ కూడదంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

జీవితము మరణించడానికైతే

జీవితము మరణించడానికైతే సంతోషాన్ని కలిగించవద్దు
దుఖ్ఖంతో ప్రతి క్షణం నా ఆత్మను ఆవేదనతో వేధించగలను
సమస్యలు చిక్కుగా పరిష్కారం లేనివిధంగా ఉన్నాయి
ఎన్ని నేర్చుకున్నా తెలుసుకున్నా ఆత్మ ఆవేదన తీరనిది
దుఖ్ఖము నుండి మరో విశ్వానికి సంతోషంగా వెళ్ళడానికి
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

ఒక జన్మ జీవితం చాలు దేనికైనా

ఒక జన్మ జీవితం చాలు దేనికైనా ఎంతటి దానికైనా
నీ ఆశయాలను నెరవేర్చుకొనుటకు అవకాశం రాకపోయినా
నీ ఆశయాలను ఎవరైనా అధిగమించినా నీ వారేనని భావించు
నీకెప్పుడైతే అవకాశం వస్తుందో ఆనాడు నీ ఆశయాన్ని నెరవేర్చుకో
కొన్ని ఆశయాలను నీవు ఎన్ని జన్మలకు అధిగమించలేక పోతావనుకుంటే
అలాంటి వాటికై నీవు ఓ విశ్వ భావనను మహా గొప్పగా మేధస్సున గ్రహించాలి
విశ్వము నాదే నాలో ఉన్నది విశ్వమే ఇక నా ఆశయాలకై ఓ విశ్వ భావన చాలు
మరో జన్మ నాకై ఉన్నా గత ఆశయాలకై అవసరం లేదనే నా ఆత్మ భావన తెలుపుతుంది -
ఎన్నో ఆశయాలతో జీవించే మనము అన్నింటిని ఒకే జన్మలో నేరవేర్చుకోలేము
మళ్ళీ జన్మించి మళ్ళీ విద్యను నేర్చి అనుభవంతో శ్రమిస్తూనే ఎన్నో అధిగమించాలి
మాయగా తీరని ఆశల ఆశయాలకు మరోజన్మ అవసరంలేదని కార్య కారణమును తెలుసుకున్నా -
జీవించే జీవన విధానము తెలిసిన మనకు మరో జన్మ ఎందుకని నే తెలుపుతున్నా -
ఈ జన్మలోనే విశ్వ విజ్ఞానమును తెలుసుకుంటే మన జీవితము సంపూర్ణమవుతుందని -
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

నాలో ఉన్న విశ్వ విజ్ఞానాన్ని ఎంతని

నాలో ఉన్న విశ్వ విజ్ఞానాన్ని ఎంతని తెలుపను
తెలిపే కొద్ది పెరుగుతున్నదే గాని తరగటం లేదు
నేటి జన్మలో నా భావాలన్నింటిని తెలుసుకోలేకపోతే
నాలోని విశ్వవిజ్ఞానాన్ని ఒక శాతమైన గ్రహించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

ఓ మహా గ్రహంపై విశ్వ భావనతో

ఓ మహా గ్రహంపై విశ్వ భావనతో కూర్చొని ధ్యానిస్తుంటే
ఆ గ్రహ భ్రమణ వేగానికి గ్రహమే కనిపించని విధంగా ఉన్నది
అంతటి వేగములో నా శరీరము సూక్ష్మమై శూన్యమైనది
శరీరము శూన్యమైనా భావన మాత్రం తటస్థంగా నిలిచింది
విశ్వ భావన లేకపోతే గ్రహముపై నిలిచే శక్తి ఎవరికీ లేదు
గ్రహము భ్రమణంతో ప్రయాణించినా తటస్థంగా నిలువగలను
ఏ వేగానికైనా విశ్వ భావనతో నిలిచే వాడిని నేనే
బంతివలె గ్రహము ఎలా ఏ కోణంలో తిరుగుతూ ప్రయాణించినా
నేను గ్రహము పై భాగముననే కూర్చొని ధ్యానిస్తూ ఉంటా
నాలాగే మీలో విశ్వ భావన తటస్థంగా నిలవాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

ఆంగ్లము రానియెడల అభివృద్ధిని

ఆంగ్లము రానియెడల అభివృద్ధిని సాధించలేవు
ఆంగ్ల భాష రాకపోతే ఉద్యోగమైనా రాని విధంగా
ఆంగ్లము రాక స్నేహితులు కూడా తరిగిపోయేరు
ఆంగ్లముతోనే విశ్వమంతా ప్రయాణించగలవు
ఆంగ్లమే సమాజ భాష ఇతర భాషే మాతృ భాష
మాతృ భాష ఆంగ్లమైతే త్వరగా అభివృద్ధి చెందగలవు
విద్యను అభ్యసించుటకు కూడా ఆంగ్ల భాషే రావాలి
ఏ విషయాన్నైనా ఆంగ్లములో నేర్చుకోవచ్చు కాని
ఇతర భాషలను ఆ భాషల పదాలతోనే నేర్చుకోవాలి
ప్రతి భాషకు ఆ భాష వ్యాకరణమే ముఖ్యము
విషయాన్ని తెలుసుకొనుటకు ఏ భాషైనా ఒక్కటే
ఆంగ్లమును భోధించువారు గొప్ప వారేనని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

ఆంగ్లమే సమాజ భాషగా

ఆంగ్లమే సమాజ భాషగా విశ్వమంతా మాట్లాడెదరు
ఇతర భాషలన్నీ మాతృ భాషగా మాట్లాడెదరు
తెలిసిన వారితో ఏ భాష మాట్లాడినా ఇతరులతో ఆంగ్లమే
ఆంగ్లమే విశ్వ భాషగా విజ్ఞాన ప్రజ్ఞానమవుతుంది
ఆంగ్లము రానియెడల అభివృద్దిన వెనుకబడి పోతావు
ఆంగ్లమును పరిపూర్ణంగా నేర్చేందుకు ఎన్ని మార్గాలున్నా
విశ్వమంతా ఎదిగేందుకు నీ మేధస్సులో మహా ఆలోచనకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

మేఘాల కదలికలో విశ్వమూ

మేఘాల కదలికలో విశ్వమూ కదులుతున్నట్లు
ఆకాశాన మేఘాలు వెళ్ళుతూ ఉంటే అనిపిస్తుంది
నక్షత్రాలు చంద్రుడు అలా మేఘాలలో వేగంగా వెళ్ళుతున్నట్లు
సముద్ర తీరాన అలల దిశ వైపు ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది
మేఘాలు పూర్తిగా నల్లవైతే కనిపిస్తూ కనిపించక దాగి పోతుంటాయి
మేఘాలు ప్రయాణిస్తున్నంత వరకు విశ్వమూ ప్రయాణిస్తుందేమోనని
భూ గ్రహము భ్రమణంలా గాలికి ప్రయాణం సాగుతుందేమో
మేఘాలతో నీవు ప్రయాణించేలా విశ్వాన్ని తిలకించేందుకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

Thursday, July 22, 2010

నా మేధస్సు త్రీలోక జ్ఞానముచే

నా మేధస్సు త్రీలోక జ్ఞానముచే విశ్వమున అన్వేషిస్తున్నట్లు
విశ్వ విజ్ఞానము నా మేధస్సున దివ్య భావంతో చేరుతున్నది
మూడు ఆలోచనలు ఒకే క్షణాన ముల్లోకాలయందు కలుగుతూ
ఒకే మనస్సుతో విజ్ఞానాన్ని గ్రహించేలా మర్మధ్యాస నాలోనున్నది
బహు పర ఆలోచన తత్వ గుణ స్వభావాలు కలవారిలో లోకాలు ఎన్నైనా
ఆలోచనలు అనంత లోకాలయందు ఒకే క్షణాన అనుసంధానమవుతాయి
బహు ఆలోచన విజ్ఞాన భావాలు మీలో విశ్వ విజ్ఞానిగా కలగాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

నా భావాలను విశ్వ ప్రచారం చేస్తే

నా భావాలను విశ్వ ప్రచారం చేస్తే విశ్వమంతా ఆధ్యాత్మయే
ఆధ్యాత్మ విశ్వమున ప్రతి జీవి ధ్యాన భావ స్వభావాల ధ్యాసతో
ఆత్మ ధ్యాసలో కలిగే భావ స్వభావాలను తెలుసుకొనుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

విశ్వమే నీలో ఉన్నందున విశ్వ జీవిగా

విశ్వమే నీలో ఉన్నందున విశ్వ జీవిగా జీవిస్తున్నావు
విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకొనుటకే నీవు జన్మించావు
విశ్వం ఉద్భవించిన తీరులో నీవు ఆత్మను తిలకిస్తావని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

విశ్వము నేదేనని జీవిస్తే విశ్వ

విశ్వము నేదేనని జీవిస్తే విశ్వ రూపములన్నీ నీవే
నక్షత్రమైనా సూర్య కిరణమైనా ఇంద్ర ధనస్సైనా నీదే
విశ్వ కాల ప్రభావము తప్ప అన్నీ నీవేనని నీలో నీతో
విశ్వ రూపాలను నీవు తిలకించుటలో కలిగే భావాలు
మరలా విశ్వ రూపాలు నిన్ను గ్రహించి నీ రూపాలేనని
తెలుపుతున్నా నీవు గమనించ లేనందున తెలియుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

Life has a target

Life has a target to achieve the success through a chance to challange the work
How to face a challange depends on choosing a chance
Chance is your life to prove the target to achieve that way
You have always time but the way of chance is getting to struggle in your mind

విశ్వమున మరో దివ్య కాంతి రూపం

విశ్వమున మరో దివ్య కాంతి రూపం ఉదయిస్తున్నది
ఎవరికి తెలియని వేళ పరిశుద్ధ స్థానమున ప్రకాశిస్తున్నది
మానవ నేత్రముతోనైనా చూడని విధంగా సూక్ష్మమైనది
ఆత్మ జ్ఞానోదయ నేత్రముతోనే దర్శించేలా మెరుస్తున్నది
నా ఆత్మ జీవముతో నేను సృష్టించుకున్న మహా రూపమే
విశ్వమున ఎవరూ చూడని విధంగా శూన్యంలా నిలిచిపోతుంది
మీ రూపాన్ని కూడా నక్షత్ర కాంతిగా సృష్టించుకోవాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

విశ్వమే నీదని నే తెలుపుతున్నా

విశ్వమే నీదని నే తెలుపుతున్నా గ్రహించని ఆలోచనగా నీ మేధస్సున
శ్వాసలో గమనించినా విశ్వమే నీదని నీకు ఆత్మయే తెలుపుతున్నది
విశ్వంలో కూర్చొని ధ్యానించమని ఆత్మ భావాలే నీకు తెలుపుతున్నాయి
ఏనాడైనా గ్రహించినావా విశ్వమే నీ శ్వాసలో ధ్యానిస్తూ జీవిస్తున్నది
ఆత్మయే విశ్వమని నీకు తెలియుటకే విశ్వ విజ్ఞానాన్ని గ్రహించాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

Wednesday, July 21, 2010

నా జన్మ కారణము తెలియక నా

నా జన్మ కారణము తెలియక నా జీవిత అర్థం కూడా తెలియకున్నది
కార్య కారణ శాస్త్రము వలె నా జన్మ కారణము ఓ మర్మ రహస్యమే
నా మరణంతో నా జీవిత ఆశయం వ్యర్థమైతే కారణము సరికాదనా
నా ఆశయానికై మరల మరో జన్మ నాకు విధిగా కలుగుతుందా
నేటి జన్మలో పొందిన విశ్వ విజ్ఞానాన్ని మరల తిరిగి పొందాలా
ఆశయం వద్దు జీవితం వద్దు మరో జన్మ వద్దు విశ్వ విజ్ఞానం వద్దు
శూన్యములో చైతన్యమైతే చాలు నా జన్మ నాకు సార్థకమేనని భావిస్తా
మీ జీవితాలు ఏమిటో ఎందుకో తెలుసుకోవాలని కారణమునకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

విశ్వమే నాలో జీవిస్తుందని ఎవరికి

విశ్వమే నాలో జీవిస్తుందని ఎవరికి ఎలా తెలుపాలో కాలమే నిర్ణయిస్తుందా
నా భావాలను అర్థం చేసుకునే వారు లేకనే ఇంకా తెలియని నా జీవితము
ఆత్మ జ్ఞానం లేక విశ్వ విజ్ఞానం లేక ఎందరికో నా భావాలు అర్థం కానున్నవి
నా జీవితాన్ని నిర్ణయించేదెవరో కాలానికి కూడా తెలియకపోతే నా జన్మే వృధా
విశ్వ విధానాన్ని సరైన రీతిలో మార్చాలనుకున్న నా మహా ఆలోచన వ్యర్థమా
నా విశ్వ విజ్ఞాన ఆత్మ మేధస్సు శూన్యమైతే పరమాత్మలో ఐక్యమై పోతాను
మరల రాలేను విశ్వ ప్రపంచాన్ని చూడలేను మర్మముగా మరో లోకాన ఉంటా
మీ జీవితం కన్నా మీలోని మహా ఆశయాన్ని విశ్వానికి అందించలేకపోతే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

కొంత కాలం ఇష్టంలేని ఆలోచనలు

కొంత కాలం ఇష్టంలేని ఆలోచనలు మేధస్సును వెంటాడుతాయి
మరో కార్యాలను చేసేందుకు ఉత్తేజము లేక శిరోభారమవుతాయి
మేధస్సున మరో గొప్ప ఆలోచన కలిగేవరకు కాలం అయోమయమే
ఇష్టంలేని కార్యాలకు ఇతరుల ప్రమేయం మానసిక ఒత్తిడిగా ఉంటుంది
ఏ విషయాన్నైనా శిరో భారాన్ని కలిగించని విధంగా తెలుపుటకు
ఆత్మ జ్ఞానం చెందావా శ్వాస నీలోనే విశ్వమా!

కాలం గడిచే కొద్ది కొత్తవారు

కాలం గడిచే కొద్ది కొత్తవారు పరిచయమవుతారే గాని
పాత వారు దూరమవుతున్నారని బాగా గుర్తించుకో
ఆనాటి స్నేహ బంధాలు దూరమై కొందరిని మరిచెదవు
కొత్తవాళ్ళు ఎందరు పరిచయమైనా పాత జ్ఞాపకాల బంధంలో
ఆనాటి జీవితం ఆత్మ సంబంధాల ఆత్మీయత కాల విశేషం
జ్ఞాపకాలలో గుర్తున్నా కలుసుకోలేని ఆత్మీయులకై
ఆత్మ జ్ఞానం చెందావా శ్వాస నీలోనే విశ్వమా!

ఓ మనిషి అందుబాటులో ఉన్నాడంటే

ఓ మనిషి అందుబాటులో ఉన్నాడంటే ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తారు
తన పనిని తాను చేసుకోలేక ఇంకొకరి పని చేస్తానని మరొకరికి అంట పెడతారు
ఏ ఆలోచన సమస్యను తెలుసుకోకుండా మరొకరికి చెప్పడం సమంజసం కాదు
సమస్యలను తగ్గించుటకైతే సరి పెంచేందుకైతే ఎందరికో నష్టమేనని తెలుస్తుంది
నీవు చేయగల పనిపై దృష్టిని కేంద్రీకరించి నీ ద్వారా ఎవరికి సమస్యలు రానట్లు
ఆత్మ జ్ఞానం చెందావా శ్వాస నీలోనే విశ్వమా!

Tuesday, July 20, 2010

పెళ్ళితో జీవన విధానమే కాక

పెళ్ళితో జీవన విధానమే కాక ఆశయాలు కూడా మారుతాయి
మహా గొప్ప ఆశయాలైతే పెళ్ళితో తీరకపోతే సమాజం సమస్యలతోనే
పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేకపోయినా వద్దని నిర్ణయించుకున్నా
తల్లిదండ్రులు బాధ్యతగా చేసుకోమనే ఎన్నో రకాలుగా తెలిపెదరు
నీ మేధస్సును వంచేలా నీ ఆలోచనలను మార్చేలా చేస్తారు
చివరికి పెళ్ళితో నీ ఆశయాలు నెరవేరక నీ వాళ్ళనూ మార్చలేక
ఇతరులకు నీవు మేలు చేయక సమాజము స్వార్థంగా తయారవుతుంది
ఓ మహా మనిషి ఆశయాలను తెలుసుకోలేని గుర్తించని వారెందరో
నేను తెలుపాలనుకున్నా వారి సిద్ధాంతాలే తెలుపుతారుగాని
నేను ఎందుకు వద్దంటానో నా జీవిత ఆశయాన్ని గుర్తించలేకపోతున్నారు
మీ భాధ్యతలకన్నా నా ఆశయాలు గొప్పవని తెలుసుకునేందుకు
ఆత్మ జ్ఞానం చెందావా శ్వాస నీలోనే విశ్వమా!
నేను మరణిస్తే నా విశ్వ విజ్ఞాన ఆశయాలను ఎవరూ తెలుసుకోలేరు
రాబోయే వారి జీవితాలను ఎవరూ మార్చలేరు మీకైనా అవగాహన లేదు
సమస్యలను సముద్రంలో వేసినా కెరటాలుగా ఉప్పొంగి మహా సమస్యలవుతాయి
నా ఆలోచనలను మార్చడం కంటే మీ ఆలోచనలను పరీక్షించుకోండి
మీరు ఎలాగైనా జీవిస్తారు జీవించలేని వారిని జీవింప గలరా
కరుణ దయా గుణాల కన్నా ఆత్మ భావాలు నాకు ముఖ్యమైనవి
తెలుపుతూ పొతే విశ్వం ఆగుతుందేమోగాని నా ఆశయాలు మారవు
ఇప్పటికైనా ఆత్మ జ్ఞానం చెందావా శ్వాస నీలోనే విశ్వమా!

నా మానవ రూపము ఆకాశమేగాని

నా మానవ రూపము ఆకాశమేగాని శరీరము కాదు
విశ్వ అధ్యాయమునకు వచ్చిన శూన్య స్వరూపుడనే నేను
భావనగా మొదలై పరమాత్మ తత్వమున జన్మించిన వాడిని
ప్రతి రూపము నా విశ్వ ఆత్మ రూపమేనని నా మేధస్సులో
నా గురించి విశ్వ విజ్ఞానంతో ఆలోచించుటకు ప్రయత్నించండి
ప్రాపాంచిక సమాజ సంసారములవలె నాకై ఆలోచించకండి
ఆత్మ జ్ఞానం చెందావా శ్వాస నీలోనే విశ్వమా!

Monday, July 19, 2010

సూక్ష్మ అవగాహన పరిశీలన

సూక్ష్మ అవగాహన పరిశీలన ప్రజ్ఞానమే శాస్త్రీయము
శాస్త్రీయ అన్వేషణ పర్యవేక్షణయే సాంకేతిక విజ్ఞానము
ఏ విషయమైనా ఏ వస్తు రూప విషయ మార్పైనా
ఎన్నో రకాలుగా ఏకాగ్రతతో గమనిస్తూ విషయ కారణాన్ని తెలుసుకుంటే
ఎన్నో ఆశ్చర్య విషయాలు మేధస్సున తెలియునని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

మనస్సులో ఏమున్నా క్షణ కాలమే

మనస్సులో ఏమున్నా క్షణ కాలమే నిలుస్తుంది
మరో క్షణాన మరో విషయంతో ఆలోచిస్తుంటుంది
మేధస్సుతో కేంద్రీకరిస్తే ఏకాగ్రతతో కొంత కాలం
ఓ విషయాన్ని ఆలోచిస్తూ అర్థాన్ని గమిస్తుంది
అర్థం తెలిసిన తర్వాత విషయం జ్ఞానంగా మారి
మేధస్సున చేరి మరల మరో విషయాన్ని అన్వేషిస్తుంది
ఏకాగ్రతలో కూడా వేర్వేరు సూక్ష్మ విషయాలను ఆలోచిస్తుంది
మనస్సులోని విషయం కన్నా మేధస్సులోని జ్ఞానమే గొప్పది
మేధస్సుతో మనస్సును ఆలోచింపజేస్తే ఎన్నో అర్థాలు తెలియునని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

మనస్సులో ఏమున్నదని అడిగితే

మనస్సులో ఏమున్నదని అడిగితే ఏమని తెలిపేది
క్షణములో మారే మనస్సు ఏ విషయాన్ని తెలుపును
మేధస్సులో ఉండే విషయమైతే తెలుపవచ్చని
మనస్సుతో ఆలోచిస్తే దేనిని తెలుపలేమని
ఏదైనా విజ్ఞానంగా మేధస్సున గ్రహించిన తర్వాతనే
నిర్భయంగా ఖచ్చిత విషయాన్ని సమగ్ర ప్రజ్ఞానంతో
అందరికి అర్థమయ్యేలా అవగాహనతో తెలుపవలేనని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

English - ఆంగ్లభాష

ప్రపంచమున ఆంగ్ల భాష ప్రాముఖ్యత పెరుగునని
అన్ని దేశాలలో విద్యను ఆంగ్లమున అభ్యసించురని
సమాచార కేంద్రాలలో అధిక భాగము ఆంగ్లమేనని
ప్రపంచమున ఎక్కువగా మాట్లాడే భాష ఆంగ్లమేనని
ఏ విషయాన్నైనా నేటి సాంకేతిక పరిజ్ఞానం ద్వార
ఆంగ్లమున తెలిపితే క్షణాలలో విశ్వమంతా తెలియునని

ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
In the entire World, the importance of English is increased day by day -
In all countries English is more to study for education and communication -
In communication channels (media) so many are in English -
In the entire world so many people speaking in English -
Any information reveals in English via Technology it spreads entire world very fast -

Sunday, July 18, 2010

ఆత్మలోనే సకల విశేషణములు

ఆత్మలోనే సకల విశేషణములు కలవని తెలుసుకో
శ్వాస మనస్సు భావం స్వభావం తత్త్వం దైవం
గుణం ప్రవర్తన ఆలోచన దయా కరుణా విశ్వశక్తి
పైన తెలిపినవి మానవ ఆత్మ సంబంధమైనవి
ఇతర జీవులలో ఆలోచన ఉండదని తెలుస్తుంది
ఇతర జీవులన్నీ భావాలతోనే జీవిస్తాయని నేను
ఆలోచనతో ఆత్మను గుర్తించినది మానవుడే
ఆలోచనతో విజ్ఞాన మేధస్సును వృద్ధి పరచుకున్నాడు
ఆలోచనతో అంతరిక్ష ప్రయాణము వరకు మానవ మేధస్సే
ప్రాపాంచికము నుండి ఆధ్యాత్మ వరకు సూక్ష్మ మహా కార్య ప్రజ్ఞానం
ఆలోచనతోనే మేధస్సున ఆత్మ విశ్వ విజ్ఞానం చెందవచ్చని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

కాలం ఎప్పుడూ అజ్ఞానాన్ని

కాలం ఎప్పుడూ అజ్ఞానాన్ని సూచిస్తుందని నేను తెలుపుటలో
మేధస్సు ఆలోచించే విధానానికి కార్యము చక్కగా జరగకపోవటమే
మేధస్సుకు కార్య కారణ శాస్త్రము ప్రతి కార్యమునకు తెలియకనే
చాలా కార్యములలో కొన్ని సూక్ష్మ పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి
పొరపాట్ల వల్ల సమయం వృధా అవుతూ ఎన్నో రకాల ఇబ్బందులు
ఒక పనిలో జరిగే పొరపాటు వల్ల ఇంకో అనవసరమైన పని కలగరాదు
అనవసరమైన పనులతో మానసికంగా ఆర్థికంగా కాస్త కష్ట నష్టాలే
కార్య కారణ శాస్త్రమేంటే ఓ పనిని సూటిగా లోపం లేకుండా చేయడమే
సూటిగా చేయడానికి మేధస్సులో ఓ అవగాన ఆలోచన విధానం కలగాలి
ప్రతి కార్యాన్ని పరిశీలిస్తూ ఏకాగ్రతతో చేస్తే కార్య కారణం తెలుస్తుంది
జీవితంలో ఎదురయ్యే పొరపాట్లను అవగాహన చేస్తూ కారణాన్ని గుర్తించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

ఆత్మతో జన్మిస్తున్నపటి నుండి

ఆత్మతో జన్మిస్తున్నపటి నుండి ప్రపంచ కార్యాలతో సాగుతూనే ఉన్నావు
జీవిత జీవన కార్యాలతోనే సమాజమున అందరిలా జీవిస్తూనే ఉన్నావు
నీ సమస్యలుగాని సమాజ సమస్యలుగాని తీరక ఎన్నో మిగిలిపోయాయి
నీవు అనుకున్నది సాధించలేదు సమాజాన్ని మార్చలేక పోతున్నావు
నీకంటూ ఓ గుర్తింపు సమాజమున కలగలేదు ఆ కార్యాన్ని చేయలేదు
ఓర్పు సహనం చైతన్యంతో కూడిన మహా శాంతి కార్యాలను చేయనేలేదు
నీవు మారలేదు సమాజ ప్రపంచాన్ని మార్చలేదు కుటుంబము అలాగే
ఎదుటివారికన్నా గొప్పగా ఎదగాలని ఉన్నా ఇంకా ఎంతో ఎదగాలని ఆశ
ప్రపంచ జీవితంలో ఎంత ఎదిగినా నీకన్నా గొప్పవారు ఎందరో ఉంటారు
విశ్వ కార్యములతో మహా కార్యాన్ని చేపట్టి విశ్వ విధాతగా ఎదగాలి
విశ్వ కార్యమునకు ఆత్మ జ్ఞానం మహా ఆలోచన దీక్ష సాధన అవసరం
అన్ని మార్పులకు దివ్య జ్ఞాన ఆనందానికి కావలసిన స్పూర్తి ఆత్మ చైతన్యమే
నీ విజ్ఞానాన్ని ఆత్మ జ్ఞానంతో ఆలోచిస్తే నీ మేధస్సులో మహా ఆలోచనలే
విశ్వ కార్యాలను చేసేందుకు ఆత్మను శ్వాస గమనంతో మేల్కొల్పేందుకు
ధ్యాన సాధనయేనని నేటి నుండి వయసును మరచి ఉత్తేజముతో
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

ప్రపంచ కార్యాలు ఎన్ని చేసినా

ప్రపంచ కార్యాలు ఎన్ని చేసినా మానవుడిగానే
విశ్వ కార్యాలలో ఓ కార్యాన్ని చేసినా విశ్వాత్మగా
విశ్వ కార్యాలేవో తెలియుటకు నీ మేధస్సుతో
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

ప్రతి కార్యాన్ని ఆత్మ జ్ఞానంతో

ప్రతి కార్యాన్ని ఆత్మ జ్ఞానంతో ఆలోచించి పరిష్కారించు
మహా కార్యాలకు ఆత్మ జ్ఞానం లేకపోతే సమస్యలెన్నో
నీ వైపు నుండి కాకుండా నీ వారి గురించి ఆలోచించు
కార్యమున ఏ విధమైన అజ్ఞాన నష్టము కలగరాదని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

విశ్వమున నీవు ఎక్కడ ఉన్నా

విశ్వమున నీవు ఎక్కడ ఉన్నా అద్భుత విజ్ఞానం తెలియాలంటే
ఓ అద్భుతాన్ని తిలకించే సమయాన ఓ ఆలోచనను గ్రహించు
ఇలాంటి అద్భుతాలు ఎన్నైనా నా మేధస్సులో చేరుతూనే ఉంటాయి
అద్భుతాలకు కృషి ధీక్ష రహస్య ఆలోచనలు నా భావాలే
నా నుండి వెళ్ళే తరంగాలు ఇతరులకు అద్భుత ఆలోచనలు
ఆలోచనల రూప కల్పన సాధనతో నిర్మించినవే అద్భుతాలు
మేధస్సు నుండి వెళ్ళిన ఆలోచనలు మరల నాలో అద్భుతాలుగా
అద్భుత విజ్ఞానం నాలో చేరుతున్నట్లు మీలో కలిగేందుకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

శ్వాసలోనే సంతృప్తి కలుగుతుందని

శ్వాసలోనే సంతృప్తి కలుగుతుందని శ్వాసనే గమనించు
శ్వాస గమనంతో ఏకాగ్రత ఏర్పడి ప్రశాంతత కలుగుతుంది
ప్రశాంతతో ఆరోగ్యం అధికమై శరీరం తేజోదయమవుతుంది
ఆరోగ్య శ్వాసతో మేధస్సు విజ్ఞానవంతమై ఉత్తేజమవుతుంది
ఉత్తేజము నుండి కలిగే ఆలోచనలు ఆత్మను స్పర్శిస్తాయి
ఆత్మను విజ్ఞాన పరచుటకు ధ్యాన సాధన అవసరం
శ్వాస ధ్యానముతోనే మహా సంతృప్తి ఆత్మకూ కలుగుతుంది
ఆత్మ సంతృప్తితో శూన్య చైతన్యాన్ని పొందుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

కాలం ఎప్పటికీ అజ్ఞానాన్ని

కాలం ఎప్పటికీ అజ్ఞానాన్ని సూచిస్తుందనే మేధస్సు గ్రహించాలి
క్షణ సమయంలో కూడా సూక్ష్మ అజ్ఞానాన్ని కలిగిస్తుంది
మేధస్సు ఏకాగ్రతతో గమనిస్తే తక్షణమే తెలుస్తుంది
కొన్ని తప్పులు చేసిన కొంత కాలానికి తెలుస్తాయి
మనకు తెలియని అజ్ఞాన సూక్ష్మ కార్యాలు మన మహా కార్యాలలో ఎన్నో జరుగుతాయి -
సూక్ష్మ కార్యాలను కూడా విజ్ఞానంగా ఏకాగ్రతతో చేస్తే
సంపూర్ణ కార్యాన్ని నిర్వర్తించినట్లు గొప్ప భావన కలుగుతుంది
మనస్సు యొక్క ఆలోచన లోప ప్రభావమే అజ్ఞానానికి కారణం
దీర్ఘ కాల ఏకాగ్రత మనలో ధృడంగా లేక అజ్ఞానానికి దారితీస్తుంది
మన గుణ భావ ప్రవర్తనలో ఓర్పు లేకపోయినా అజ్ఞానం కలుగుతుంది
కార్య కారణ విధానాన్ని తెలుసుకుంటే కార్యాలు విజ్ఞానంగా సాగుతాయి
కార్య కారణమున కాలం కూడా వృధాకాక విజ్ఞానంగా కార్యాన్ని నిర్వర్థిస్తాం
మనం ఎలా ఉన్నా మనం చేసే కార్యాలు కార్య కారణంతో సాగాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

మరోసారి మరో జన్మలో ఎలాంటి

మరోసారి మరో జన్మలో ఎలాంటి రూపాన్ని దాల్చెదవో
మానవ రూపము కాని రూపంతో ఆత్మ విజ్ఞానం కలగదే
ఆ రూపంతో కర్మను గాని విధిని గాని అనుభవిస్తే ఎలా
ఆ రూపమున గుణ భావ స్వభావాలు గొప్పగా లేకపోతే
మరలా మానవ రూపాన్ని పొందలేవని ఓ ఆలోచన
ఈ జన్మలోనే మానవ మేధస్సుతో ఆత్మ విజ్ఞానం చెందాలని
నా భావాలు నిన్ను అన్వేషిస్తూ దివ్య జ్ఞానాన్ని తెలుపుతున్నాయి
మరోజన్మ లేకుండా కర్మను నాశనం చేసుకోవటమే ముఖ్య సారాంశం
కర్మ నాశనమైతే ఆత్మ శూన్యాన్ని చేరి విశ్వ శక్తిలో భావమై నిలుస్తుంది
మహా భావాలతో విశ్వమున మర్మ తేజస్సుతో నిలిచిపోవాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

Saturday, July 17, 2010

మీకోసం వేచియున్నా నూతన జీవిత

మీకోసం వేచియున్నా నూతన జీవిత ఆరంభమునకై
క్షణ కాలం మీకు ఉపయోగం నాకు ఆధ్యాత్మ భావం
కొన్ని క్షణాలతో ఆధ్యాత జీవితాన్ని గొప్పగా సాగించు
శ్వాస గమనంతో మేధస్సును విజ్ఞాన పరచుకోవటమే
కఠిన సమస్యలున్నా మేధస్సులో విశ్వ భావన ఉందనే
ఎవరికి లేని దివ్య భావన మనలో ఉందనే మహా సంతోషం
తీరని సమస్యలున్నా విశ్వ కాంతి తేజస్సు మనలో ఉందని
విశ్వ జ్ఞానులలో నేనొక ప్రధాన అధిపతినని జీవించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

కొత్త వాళ్లకు నా ఆహ్వాన విశ్వ భావ

కొత్త వాళ్లకు నా ఆహ్వాన విశ్వ భావ స్వాగతం
మీ ఆత్మ లోని ఆనాటి ఆత్మీయ అనుబంధమే
నేడు విశ్వ విజ్ఞాన పరంగా కలుసుకున్న క్షణం
నేటి నుండి విశ్వ విజ్ఞాన శూన్య ప్రయాణమే
ఆధ్యాత్మక భావాలతో విశ్వ విజ్ఞాన అన్వేషణ
మేధస్సును ఆత్మ పరంగా విజ్ఞాన పరచడం
ప్రయాణంలో కలిగే భావాల అనుభవాలే జీవితం
ఎంతటి గొప్ప భావాలు కలిగితే అంతటి వేగంతో
శూన్యాన్ని చేరుకొని విశ్వాన్ని తిలకించడం
విశ్వ మార్పును ఆధ్యాత్మకంగా చూడడం
ఒకరికి ఒకరు విశ్వ ప్రయాణమున పరిచయమవుతూ
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

విశ్వమును గూర్చి ఏమని

విశ్వమును గూర్చి ఏమని వివరించెదను ఎలా వర్ణించెదను
ఆకాశమా అంతరిక్షమా అనంత భావాల స్వభావ తత్వమా
రూప పరిణామాల వర్ణాలలో మహా అద్భుత ఆశ్చర్యములు
సూర్య చంద్రుల నక్షత్ర కాంతులు కిరణాల ప్రకాశ తేజములు
ప్రతి అణువులో గుణ విశిష్ట విశేషణ స్వభావాలు వివిధములే
ప్రతి జీవి ఆకారరూపము వేరు జీవన ప్రవర్తన మేధస్సు వేరు
ప్రకృతి కాల ఉనికిలో ఎన్నో భ్రమణ మార్పుల ఎదుగుదలలు
కాలం సాగుతున్నా కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి
అన్ని విషయాలు అనుభవ పూర్వకంగా మనలో కలుగుటకు
మేధస్సు దివ్యంగా జ్ఞానోదయం చెందాలని విశ్వ విజ్ఞానముకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోలేక

విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోలేక శూన్యముననే మర్మముగా ఉన్నది
సంపూర్ణ విశ్వ విజ్ఞానముకై అన్వేషించే వారులేక నిధిగా మిగిలింది
సూక్ష్మ ఆత్మ ఆలోచనలు మేధస్సున లేక విశ్వ విజ్ఞానం శూన్యమందే
ఆత్మ జ్ఞానం కలవారికే విజ్ఞాన రహస్య నిధి మేధస్సున చేరగలదు
నిత్య ధ్యాన విజ్ఞాన అన్వేషణ గలవారికే సంపూర్ణ విశ్వవిజ్ఞానం కలుగునని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

ధ్యానించుటలో ఏకాగ్రత కలగకపోతే

ధ్యానించుటలో ఏకాగ్రత కలగకపోతే ఆలోచనలు ఎక్కువైతే
ఒక ఆలోచనను ధృడ సంకల్ప భావంతో మేధస్సున వదలండి
అంతా మంచే జరుగుతుంది అందరూ క్షేమంగా ఉంటారని వదిలి
కొంత కాలం శ్వాసను గమనిస్తే ఆ తర్వాత నా కార్యాలలో నిమగ్నమవుతా
నా కార్యాలలో విజ్ఞాన సామర్థ్యాన్ని పొందుటకే శ్వాస గమన ధ్యానం
అవసరమైన పనులను ముగించి ప్రశాంతంగా విశ్వ భావనతో కూర్చోండి
కొన్ని రోజులకు ఆలోచన స్థితి సరిలేకపోతే వివిధ సిద్ధాంతాలతో చేయండి
స్నానం చేసిన వెంటనే కూర్చుంటే కొన్ని రోజులకు ఓ మహా మార్పు కలగవచ్చు
ప్రశాంతమైన వాతావరణంలో తగిన సమయాన ధ్యానిస్తే ఓ విధమైన మార్పు
విజ్ఞాన సంగీతాన్ని మిత ధ్వనితో వింటూ ధ్యానిచంవచ్చు
నిద్రలో మెళకువ వచ్చిన నిద్ర నుండి లేచిన నిద్రపోయే ముందైనా కొంత ధ్యానమే
ధ్యానమున శ్వాసను గమనిస్తూ మనల్ని మనం మరచిపోవడమే కొంత కాలంగా
సాధన పెరిగే కొద్ది ఎంత సమయం ధ్యానిస్తున్నా ఎరుకతోనే మెళకువగా ఉంటాము
ధ్యానమున మనకు తెలియని ధ్యాసలో విశ్వ స్థితితో కలిగేదే ఆత్మ విజ్ఞాన భోధన
ఆత్మ భోదనలో జరిగిన విధానాన్ని తెలుసుకొనుటకు విశ్వ విజ్ఞాన ఆకాశ ప్రయాణమే -
ఆకాశాన్ని చూస్తూ సూక్ష్మ ఆలోచన విధానంతో అన్వేషిస్తే ఎన్నో విజ్ఞాన ఆలోచనలు
ఆలోచనను విజ్ఞానంగా గ్రహించే విధానం మనలో ఉంటేనే విశ్వ సందేశం అర్థమగును
సూర్యోదయ సూర్యాస్తమ చంద్రోదయ చంద్రాస్తామయ నక్షత్ర మేఘాల రూప వర్ణాలను
పక్షుల విహార వరసలను గాలి స్వభావాన్ని శ్వాస ధ్యాసతో వీలైనప్పుడల్లా తిలకించండి -
అర్థం కాని భావనలు మీలో ఏవైనా ఉంటే నా భావాలను చదువుతూ గ్రహించండి
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

కాలం ఆగిపోతున్నా మనం

కాలం ఆగిపోతున్నా మనం మరణిస్తున్నా ఆత్మ ధ్యానించాలనే అంటుంది
మరణానికి ముందు మనలో ఓ ఆధ్యాత్మ భావన కలిగితే కాలం సహకరిస్తుంది
భావనతో మరణించినా మరో జన్మలో ఆధ్యాత్మ జీవితం ఆరంభమవుతుంది
ఆత్మ విజ్ఞాన ఎరుక ఉంటేనే ఆధ్యాత్మ ప్రయాణ మార్గాన కలిసి ధ్యానిస్తావు
విజ్ఞాన ధనమున ఎంతో ఎదగాలన్న అంశంతోనే ఆత్మ జ్ఞానమున ఎదగాలి
ఆత్మ జ్ఞానమున ఎదిగిన వారే విశ్వ విధాతగా విజ్ఞాన చరిత్రలో నిలుస్తారు
ప్రధానమైన విశ్వ స్థానాన్ని మనకు మనమే అదిగమించేది ధ్యానముననేనని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

మనస్సులోనే ఆత్మ ఉందని

మనస్సులోనే ఆత్మ ఉందని విశ్వమున విజ్ఞానం చెందాలని
ప్రశాంతమైన ఏకాగ్రతకై జన్మించిన నాటి నుండి అన్వేషిస్తున్నది
ప్రాపాంచిక జీవిత జీవన విధాన సమస్యల కార్యాలతో సాగుతున్నా
ఆత్మ భావాలు మనలో ఆధ్యాత్మక జీవితాన్ని కోరుకుంటున్నాయి
ఆత్మ విజ్ఞాన ఎరుకతో గ్రహిస్తేని ఆధ్యాత్మక ధ్యాన సారాంశం తెలియునని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

విశ్వమున విజ్ఞానం చెందే వయస్సు

విశ్వమున విజ్ఞానం చెందే వయస్సు పొతే మరల రాదనీ శరీరమే
కాలంతో జీవిస్తున్నా మనస్సునే వెంబడిస్తూ విజ్ఞానం చెందుతున్నాం
ఆత్మను వెంబడిస్తే విశ్వ ప్రయాణమున విజ్ఞానాన్ని తెలుసుకోగలం
కాలం గడిచినట్లే ఆత్మ విజ్ఞానాన్ని విశ్వమున తరిగిస్తూ మేధస్సున దాచుకో
విశ్వమున తెలియని రహస్యము శ్వాసే ఆత్మని మనస్సు దాచిన మర్మము
శరీరం సహకరించకపోతే నిమిషం ఓర్పుగా ఉంటే కాలక్రమేణ హెచ్చగును
ధ్యానమునకు కొంత ఓర్పు వహిస్తే విశ్వ విజ్ఞానము నీ యందేనని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

అర్థాన్ని తెలిపే ఆలోచనయే ఎరుక

అర్థాన్ని తెలిపే ఆలోచనయే ఎరుక
తెలిసిన దానిని విజ్ఞానంగా గుర్తించేదే ఎరుక
తెలియనిదానిని అవగాహన చేసేది ఎరుక
తెలియకపోతే తెలుసుకోవాలనేది ఎరుక
మనస్సును విజ్ఞాన పరిచేది ఎరుక
మేధస్సులోని ఎరుక ఆత్మ ఎరుకతో విశ్వ విజ్ఞానం చెందాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

ఒక అణువు నుండే విశ్వం

ఒక అణువు నుండే విశ్వం ఉద్భవించిందని
ప్రతి అణువున పరమాణువులు ఉన్నట్లు
మహా అణువుల కలయికతో మహా రూపాలు వెలిసినట్లు
భావ స్వభావాలను గుర్తించుటలో ఆనాటి కాల ప్రభావమే
నేడు విశ్వమైనదని వివిధ శాస్త్రీయములు తెలుపుతున్నవి
సందేహము ఉంటే అణువు కాంతిని పరిశీలిస్తే తెలియునని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

మౌనంతో మనస్సునే మార్చుకో

మౌనంతో మనస్సునే మార్చుకో
మాటల్లో లేనిది మౌనమున తెలుసుకో జీవితాన్ని మార్చుకో
మౌనంలో విజ్ఞానాన్ని గ్రహించేది మేధస్సా లేదా మనస్సా
మేధస్సు గ్రహిస్తే మనస్సు కూడా శ్వాసలో లీనమే
మనస్సు గ్రహిస్తే మేధస్సు ఆలోచనలో ఏకమవుతుంది
మౌనంలో అన్నీ ఏకమైతే ఆత్మ ఎరుకలో విజ్ఞానం కలుగుతుంది
ఆత్మ ఎరుక విజ్ఞానం చెందాలంటే ప్రశాంతమైన ఏకాగ్రతయే
ఆత్మ ధ్యానిస్తేనే ప్రశాంతమైన ఏకాగ్రతతో విజ్ఞానం చెందుతుంది
మౌనమున తెలియని మర్మ రహస్యాలు తెలియుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

Friday, July 16, 2010

విశ్వమున ఏ జీవికైనా ముఖ్యమైనవి

విశ్వమున ఏ జీవికైనా ముఖ్యమైనవి ద్వితియములే
శరీరమున ఆహార జీర్ణ వ్యవస్థ మేధస్సున ఆహార అన్వేషణ
జీర్ణ వ్యవస్థ సరిలేకున్నా మేధస్సు సరిలేకున్నా
అనారోగ్యంతో అన్వేషణ తగ్గి జీవితం భారమవుతుంది
ఆరోగ్యం కోసం మేధస్సు అలాగే మేధస్సుకై ఆహారం
శరీర శక్తితో ఆలోచిస్తూ మేధస్సున విజ్ఞానం చెందుతూ
మరల మేధస్సుతో ఆహారానికై ఆలోచిస్తూ శ్రమిస్తున్నాం
జీవికి ముఖ్యమైనవి ద్వితియమైనా జీవించుటకు త్రితియములే
శ్రమించడం ఆలోచించడం కాలకృత్యాల శరీర ధర్మం
ఆహారం శరీర శక్తితో ఆరోగ్యానికి విజ్ఞానం మేధస్సు ఆలోచనతో ఆహార సేకరణకు
తక్కువ సమయంలో విజ్ఞానంతో ఆహారాన్ని సేకరిస్తే మరెన్నో కార్యాలు చేసుకోవచ్చు
మరెన్నో కార్యాలకు మరెంతో శక్తికై ఆహారమే ప్రధానమైనది
క్షణంలో మరెన్నో కార్యాలను విజ్ఞానంగా చేయుటకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

విశ్వమా నీవు నాకు ఏదైనా

విశ్వమా నీవు నాకు ఏదైనా తెలుపుతున్నావా
ఈ క్షణం నేను మహా ఏకాగ్రతతో వేచిఉన్నా
రహస్యం ఏదైనా చెవులకు వినపడకున్నా
మేధస్సు సునాసయానముగా స్వీకరిస్తుంది
గాలితోనైనా లేదా శూన్యము నుండైనా అందించు
నీ రహస్యానికై నేను నాలోనే గమనిస్తున్నా
విశ్వ విజ్ఞాన రహస్యాలను మేధస్సున గ్రహించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

ఆత్మ భావాలతో విశ్వ ప్రయాణాన్ని

ఆత్మ భావాలతో విశ్వ ప్రయాణాన్ని ఆకాశాన సాగిస్తున్నా
స్వర్గాన్ని దాటి గ్రహాల అంచున నక్షత్ర కాంతిలో వెళ్ళుతున్నా
మనస్సు శూన్యమయ్యే వరకు విశ్వ విజ్ఞానం తెలుసుకుంటున్నా
నేను మరణించిన స్థానమే శూన్యముగా విశ్వమునకు కేంద్ర బిందువు
శూన్య కేంద్రమున భావాలు లేక ఆత్మ పరిశుద్దమైనది
ఆత్మ పరిశుద్దము కావాలంటే విశ్వ ప్రయాణమునకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

సోమరితనం వలనే మనిషి డబ్బును

సోమరితనం వలనే మనిషి డబ్బును సృష్టించాడు
ఒక మనిషితో పని చేయించుకోడానికి పారితోషికం ఇవ్వాలి
డబ్బు లేనిదే ఎవరూ పని చేయని విధంగా ఎదుగుతున్నారు
ఆనాడు వస్తు మార్పిడితో మొదలై నేడు కోట్ల పారితోషికం వరకు
నేటికి డబ్బే ప్రధానమైన నిత్య అవసర అంశంగా మారినది
ధనం లేకపోతే ఆహారంతో పాటు మన భావాలకు ఏవి దక్కనట్లేనా
ధనం ఉంటేనే కొందరు మాట్లాడిస్తున్నారు అలాగే గౌరవాన్నిస్తున్నారు
ధనం కోసమే రోజులు శ్రమిస్తూ గడుస్తున్నాయి అలాగే అవసరాలు ఎక్కువైనాయి
ధనంతో కోరికలు పెరగడమే కాక మోసాలు కూడా పెరుగుతున్నాయి
సమాజంలో సరైన స్థితి లేకపోవడానికి డబ్బు కూడా ముఖ్య కారణమే
డబ్బులేని విధానాన్ని మరల తీసుకురావాలంటే ప్రతి ఒక్కరు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

సమాజంలో జరిగే విషయాలను

సమాజంలో జరిగే విషయాలను అప్పుడప్పుడు చర్చించు
సమాజం విజ్ఞానంగా వెళ్ళుతున్నదా లేదా అజ్ఞానంగా మారుతున్నదా
సమాజానికి కావలసిన అవసరాలు తీరుతున్నాయా లేదో తెలుసుకో
నిరుపేదలు ఎలా జీవిస్తున్నారు వారి ఆర్థిక జీవన స్థితి ఏమిటి
మూడు పూటలకు సరిపోని వృత్తి జీత భత్యములు ఎందుకు
వృత్తిని మార్చుకోలేని విజ్ఞానంతో నిరక్షరాస్యులుగా జీవిస్తున్నారు
సమాజమున నిత్య అవసరాల ధరలు ఆకాశాన్ని చేరుతుంటే నిరుపేద స్థితి ఏమిటి
నిరుపేదను మార్చలేని విజ్ఞానం ధరల పెంపుదలతో సాధించే విజ్ఞానం సమంజసమేనా -
సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరుపేదకు అందించలేకపోతున్నాం తను ఎదగలేకపోతున్నాడు -
సమాజంలో సంపూర్ణ విజ్ఞాన మార్పు లేకున్నా గొప్ప సలహాలను తెలియజేయండి
మహా కార్య విషయాల సమస్యలను పరిష్కారిన్చేందుకు మేధస్సుతో
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

పవిత్రమైన సాధారణ శ్వాసతో ఆత్మను

పవిత్రమైన సాధారణ శ్వాసతో ఆత్మను ధ్యానింపజేస్తే
కర్మలన్నీ నాశనమై నీలో మహా గుణాలు ఉద్భవిస్తాయి
ధర్మాన్ని రక్షించే విషయ సత్య ప్రజ్ఞానం నీలో కలిగి
యుగానికి యదార్థాన్ని తెలిపే సంపూర్ణ జ్ఞానిగా నిలుస్తావు
విశ్వమున విజ్ఞానిగా నిలుచుటకు మహా గుణాలతో
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

ఏ జీవి లేనిచోటైనా లేదా నీతో ఉన్న

ఏ జీవి లేనిచోటైనా లేదా నీతో ఉన్న వారితో మాట్లాడక ఆలోచిస్తేనే ఏకాగ్రత
నీలో నీవు నీ మేధస్సును నీ భావాలతో ఆలోచింపజేస్తే ఓ అవగాహన
అవగాహనతో పరిశీలిస్తే ఓ విషయాన్ని అర్థం చేసుకునే విధంగా ఆలోచనలో
ఆలోచనలను గత అనుభవాలతో మేధస్సులో విశదీకరిస్తే విజ్ఞానార్థంగా
ఎన్నో ఆలోచనలతో ఎన్నిటినో ఆలోచిస్తూపొతే ఎన్నో విషయాలు అర్థవంతంగా
మన మేధస్సులో ఎన్ని అర్థమైన విషయాలు ఉంటే అంతటి విజ్ఞానంగా
విశ్వ రహస్యాలను కదిలించే శక్తి మేధస్సుకు ఉందని అన్వేషణలో తెలియాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

మేధస్సులో జరిగే సూక్ష్మ కీలక

మేధస్సులో జరిగే సూక్ష్మ కీలక కార్యక్రమాలను తెలుసుకుంటున్నా
మేధస్సు సేకరించే విజ్ఞాన విధానాన్ని మనస్సు మార్పుతో గమనిస్తున్నా
ఏకాగ్రత ద్వియాగ్రత త్రియాగ్రత మొదలైన వాటితో జరిగే మార్పులే గుర్తిస్తున్నా
మేధస్సు ఆలోచించే తీరును అవగాహన చేస్తూ ఆత్మ ఎరుకతో పరిశీలిస్తున్నా
అనూహ్యమైన ఆలోచన కార్య విధానాన్ని శరీర అవయవాల కదలికతో స్పర్శిస్తున్నా
కణాల స్పర్శలో కలిగే మనస్సు మార్పును కూడా గమనించేందుకు ఏకాగ్రతతో
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

మేధస్సుతో ఆలోచించి పని చేస్తున్నాం

మేధస్సుతో ఆలోచించి పని చేస్తున్నాం
చేసిన వాటిని తాత్కాళికంగా మరచిపోతూ ఆలోచిస్తూనే ఉన్నాం
పాత వాటిని మరచిపోతూ కొత్త వాటిని ఆలోచించడం చేస్తున్నాం
కొత్త ఆలోచనలు రాకపోతే మరల పాత ఆలోచనలను గుర్తు చేసుకుంటాం
జ్ఞాపకాలలో ఉండే ఆలోచనలతో కొత్త ఆలోచనలు వచ్చే వరకు ఆలోచిస్తాం
ఆలోచన లేకపోతే మేధస్సు ఆగిపోతుందని నిద్రించినా ఆలోచిస్తూ ఉంటాం
ఆలోచనలోనే మహా యంత్ర విధానము ఉన్నదని విజ్ఞాన మేధస్సుకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

మనస్సు మాయగా మారునట్లు

మనస్సు మాయగా మారునట్లు నాలో మాయ దాగి ఉన్నదా
మాయగా మారే మనస్సు నా విజ్ఞానాన్ని మాయ చేస్తున్నదా
మనస్సు మారుటలో ఏకాగ్రత లేకనే విజ్ఞానం మారుతున్నదా
ఎకాగ్రతకై మనస్సు మార్పును బంధించే ఎరుక నాలోనే ఉన్నదా
విజ్ఞాన మార్పుకు మనస్సును కేంద్రీకరించే ఎరుక నా మేధస్సున
మనస్సుతో ఆలోచించవద్దు ఎరుకతో విజ్ఞానం చెందుటకై మేధస్సున
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

మనస్సు మాయ చేసినా మేధస్సుకు

మనస్సు మాయ చేసినా మేధస్సుకు తెలుస్తుంది
మేధస్సుకు తెలియకుండానే మనస్సు మాయ చేస్తుంది
మనస్సు మేధస్సును ఓ క్షణం మరో ధ్యాసలో ఉంచుతుంది
ఆ క్షణమే మనస్సు మారి మరో కార్యాన్ని ఆలోచిస్తుంది
మనస్సు మారినప్పుడే కార్యమున తప్పులు జరుగుతాయి
తప్పు జరిగిన తర్వాత మేధస్సు మనస్సు మార్పును గుర్తిస్తుంది
మేధస్సు ఏకాగ్రతను మార్చే శక్తి లేదా ధ్యాస మనస్సుకే ఉంది
మనస్సును కూడా మేధస్సుతో ఏకాగ్రతగా కేంద్రీకరించే శక్తి ఎరుకకే
ఎరుక కూడా విజ్ఞాన ధ్యాసతో ఉంటేనే మనస్సు కొంత కాలం ఏకాగ్రతతో
ఓ విజ్ఞాన కార్యానికి మనస్సు ఎకీభవిస్తేనే కార్యార్థం తెలియును
మన మేధస్సులో విజ్ఞాన ఎరుక దృడంగా ఎదగాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

Thursday, July 15, 2010

అజ్ఞానం కలుగుతున్న తక్షణంలో

అజ్ఞానం కలుగుతున్న తక్షణంలో మనస్సును కేంద్రీకరించు
మనస్సు మారుతున్న తక్షణమే విజ్ఞాన ఎరుకను గ్రహించు
కళ్ళు చూస్తున్నా మేధస్సుకు విజ్ఞానంగా తెలిసినా చేతులు చేసిన కార్య విధానమున
క్షణ కాలంలోనే మనస్సు మారి మేధస్సును మరిపించి మరో ధ్యాసతో తప్పు జరిగినది
క్షణంలో పూర్తి చేయవలసిన కార్యములలో తెలియని తప్పులెన్నో
మేధస్సు గ్రహించని తప్పులకు ఏకాగ్రత లేని మనస్సే కారణము
మేధస్సును కేంద్రీకరించుటకు విజ్ఞాన ఎరుక ముఖ్య ఆవశ్యకమే
మనస్సే మేధస్సు విజ్ఞానాన్ని మాయచేసి జీవితాన్ని మార్చుతుంది
తప్పు జరుగుటయే అజ్ఞాన కారణముగా తెలుసుకోవలసిన మహా నీతి
మనస్సును ప్రశాంతంగా సూక్ష్మ క్షణ కార్యములపై కేంద్రీకరించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

A person likes

A person likes his own intent of thoughts -
Even the wonders also likes own way of visualization -
Working style is to prefer own way to finish the intents to reach the achievements -
Every person enjoy the life in own way of the mind how is feel to relax -
Mind only quest the thoughts to visualize the behavioural characters to immerse in the wonders -
His own wonders are others wonders feel in own way of mind

Wednesday, July 14, 2010

నిద్రిస్తే చీకటితో అజ్ఞానం

నిద్రిస్తే చీకటితో అజ్ఞానం కలుగుతుందని
మేధస్సున నక్షత్ర కమలాన్ని ధరించియున్నా
అజ్ఞానం మనిషికి సద్గుణ భావం కాదని
విజ్ఞాన వెలుగుతో గొప్పగా జీవించాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

Monday, July 12, 2010

ముందుగా మన ప్రాంతము

ముందుగా మన ప్రాంతము మౌనముతో నిశబ్దమైతే
ఆ ప్రశాంతతలోనే ఓ విజ్ఞాన రహస్యము తెలియునని
ఏకాగ్రతతో గ్రహించినట్లయితే సమస్యకు పరిష్కారము
మేధస్సున కలుగునని మౌన విచక్షణ సూచిస్తుంది
నాలుకలో మాట విజ్ఞానముకై మౌనమయ్యేందుకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

విశ్వతత్వ వేత్త జన్మించినా కాలం

విశ్వతత్వ వేత్త జన్మించినా కాలం అజ్ఞానాన్నే సూచిస్తుంది
తత్వవేత్తలో ఆత్మజ్ఞానం కలుగుటకు విజ్ఞాన ఎరుక కావాలి
ఆత్మ జ్ఞానాన్ని భోధించే గురువులు విశ్వమున అరుదుగా
సమాజమున తల్లిదండ్రులు అందరిలాగే తమ కుమారుడని
సమస్యలతో సంసార జీవితమున జీవించాలనే కోరెదరు
విజ్ఞానంతో ఆత్మజ్ఞానం చెందినా తల్లిదండ్రులు పెళ్లి చేయాలనే
లేదంటే జీవితము కాదని అందరిలాగే జీవించాలని కోరెదరు
విశ్వ తత్వవేత్త జన్మించినా సంసారంతో జీవితం వ్యర్థమైతే
లోకమున ఆత్మజ్ఞాన పరమార్థం ఎవరికీ తెలియదనే నేను
తల్లిదండ్రులు ఆత్మజ్ఞానం చెందితేనే విశ్వతత్వ వేత్త ఆశయం
నెరవేరుతుందని లోకాన్ని మార్చగలడని అవకాశం కల్పించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

నాలో దాగిన మహా విశ్వ కార్యాన్ని

నాలో దాగిన మహా విశ్వ కార్యాన్ని నడిపించాలని
అన్ని సమస్యలకు ఆ కార్యమే గొప్ప పరిష్కారమని
ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నా
విశ్వ కార్యమునకు నాతో సహాకరించాలని మీరైనా
ఈ విషయాన్ని ఒకరికి ఒకరు విశ్వమంతా తెలపండి
మీకోసం నేను కార్య సాధనకు ఎదురుచూస్తున్నా
నాతో కలవటానికి విశ్వ సమస్యలు తీరడానికి
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

నుదిటిపై మారని మహా గీత ఉంటే

నుదిటిపై మారని మహా గీత ఉంటే కాలమైనా సహకరిస్తుంది
మాటలో మహా విజ్ఞానమే ఉంటే ఎప్పటికీ సత్యంగా నిలుస్తుంది
మహా కార్యం జరగాలని ఉంటే ఒకరితో విశ్వమంతా కలుస్తుంది
నీలోని మహా కార్యాన్ని విశ్వమంతా విజ్ఞానంగా సాగించుటకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

నీకై నేను జన్మించినా నా జీవితానికి

నీకై నేను జన్మించినా నా జీవితానికి అడ్డంకులే
మీ జీవితానికి నేను మేలు చేసినా నాతో విరోధమా
నా ఆశయాన్ని మీరు కాదంటే మీకు తెలియుటకైనా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

విశ్వమున ఆత్మ ఉన్నట్లు నీలోనే

విశ్వమున ఆత్మ ఉన్నట్లు నీలోనే శ్వాస ఉన్నదని
శ్వాస నీతో ఉన్నట్లు ఆత్మ నీలో మర్మమై ఉన్నదని
ఆత్మ నీలో ఉన్నట్లు మేధస్సున విజ్ఞానమే ఉండాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

Sunday, July 11, 2010

నీవే నన్ను మార్చావని కాలం నీకు

నీవే నన్ను మార్చావని కాలం నీకు తెలిపిందా
నా మేధస్సులో ఆలోచనలను నీవే మార్చావా
నా జీవితం మారిపోవుటకే నీవు జన్మించావా
నేననుకున్న జీవితం నాకు లేనప్పుడు ఎందుకు జీవించాలి
విశ్వమున ఆత్మ కర్మ రహస్యాలు తెలిసినా జీవించలేకపోతే
నీవారు నీ మాట వినేలా నీవు "విశ్వ విధాత" గా ఎదగాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

నమస్కారము నందే ఆస్కార్ అవార్డ్

నమస్కారము నందే ఆస్కార్ అవార్డ్ ఉందని
నమస్కరించిన వారికి గౌరవ పురస్కారమైనా ఆస్కారేనని
ఆహ్వానమున ఆస్కార్ అవార్డ్ తో స్వాగతం పలుకుతూ
తెలుగు వారి సాంప్రదాయ సంస్కారమున ఆస్కార్ యేనని
గొప్పవారు కూడా నిన్ను నమస్కరించినా ఆస్కార్ వందనమే
మహా గొప్ప వాడివైతే జన కోటి నమస్కారాలు నీకేనని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

మాటే మనిషిని మార్చుతుందా

మాటే మనిషిని మార్చుతుందా
మాటలకే ఎన్నో కార్యాలు జరుగుతున్నాయా
మాటే లేకుంటే విజ్ఞానం ఎవరి మేధస్సులో వారికేనా
మాట లేకున్నా భావాలతో విజ్ఞానంగా జీవించవచ్చని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

ఎక్కడెక్కడో జన్మించే జీవులకు జీవం

ఎక్కడెక్కడో జన్మించే జీవులకు జీవం ఎలా కలుగుతుంది
ఎన్నో రకాలుగా జీవించే జీవులకు రకరకాల ఆకార వర్ణాలు ఎలా
సృష్టిలో ప్రతి రూపానికి కలిగే మార్పులకు కారణ గుర్తింపు ఏది
మనలోనే మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయని తెలుసుకొనుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

మహా జనులకు తెలియని భావాలు

మహా జనులకు తెలియని భావాలు ఎన్నో
మహా విజ్ఞానులకు తెలియని స్వభావాలెన్నో
మహా మహాత్ములకే తెలియని గుణాలు ఎన్నో
నీలో విశేషణ తత్వాలు మహా గొప్పగా కలగాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

నా విశ్వ వేదాన్ని ఆవేదనతో

నా విశ్వ వేదాన్ని ఆవేదనతో విన్నారా
నేను అనుకున్న జీవిత కాలం రాదా
నా మహా కార్యం నాలోనే ఉండిపోతుందా
విశ్వమంతా మారే జీవితం అవసరం లేదా
నేను మార్చలేకున్నా మీకోసం మీరైనా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

ఏ కార్యమైనా కొంత కాలమేనని

ఏ కార్యమైనా కొంత కాలమేనని
క్షణంలో జరిగేవి అద్భుతాలేనని
దీర్ఘ కాలం సాగేవి విజ్ఞాన వృత్తియేనని
కొంత కాలం జరిగేవి కాల ప్రభావాలని
విశ్వ కార్యాలే కాలంతో సాగునట్లు నీవు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

భూమి భ్రమణం చెందుటలో కలుగు

భూమి భ్రమణం చెందుటలో కలుగు ధ్వని తరంగాలు చెవులు మూస్తే తెలియునని -
విశ్వమున ఎంత చీకటి ఉన్నా నీ చేతులతో కళ్ళు మూస్తేనే పూర్తి చీకటి కలుగునని -
నీవు ఎంత నిశబ్దంగా ఉన్నా ఏదో ఒక సూక్ష్మ ధ్వని చెవిలో వినపడుతూ ఉంటుందని -
వేసవి కాలమున గాలి లేక ఏ చెట్లు కదలకున్నా నీలో శ్వాస ఆడుతూ జీవిస్తుందని -
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

అణువులతో అణువుగా అణువై

అణువులతో అణువుగా అణువై ఉన్నా
నా అణువే విశ్వమున సూక్ష్మముగా
ప్రతి అణువు నాకు మహా అణువేనని
మరో అణువుతో విజ్ఞానం చెందాలని నీవు
పరమాణువుగా ఒదిగి అణువంతటి జ్ఞానముకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

Saturday, July 10, 2010

మేధస్సులో మహా లోకాలు

మేధస్సులో మహా లోకాలు దాగి ఉన్నాయని
నిద్రించుటలో లోకాలను దర్శించగలవని
కలలో నీవు ఏ లోకాన ఉన్నావో తెలియాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

మరణించేటప్పుడు ఓ కోరికతో

మరణించేటప్పుడు ఓ కోరికతో వెల్లిపోతావు
జీవించుటలో ఆశ అనే భావాన్ని కలిగి ఉంటావు
మరణిస్తున్నా ఇంకా ఏదో కావాలనే కోరుకుంటావు
కర్మ నశించే వరకు ఆశ నీలో ఎన్నో కోరికలతో ఉంటుంది
నీ కర్మను వదిలించుకునేలా అన్ని కార్యాలను ముగించుకోవాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

విశ్వ ధ్వనులు చెవిలో

విశ్వ ధ్వనులు చెవిలో మ్రోగుతున్నాయి
విశ్వ సువాసనలు నాసికమున చలిస్తున్నాయి
విశ్వ రూపములు నేత్రమున దర్శనమిస్తున్నాయి
విశ్వ భావాలు మేధస్సులో కలుగుతున్నాయి
విశ్వ స్వభావాలు విజ్ఞానమున తోస్తున్నాయి
విశ్వ కాలము నీ ఆత్మలో నిలిచిపోవాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

మనస్సు మారితే అజ్ఞాన ధ్యాస

మనస్సు మారితే అజ్ఞాన ధ్యాస కలుగుతుందని
ఏకాగ్రతను కార్యముపై తదేకంగా కేంద్రీకరించి
కార్య నిర్వాహణను ప్రతి క్షణం గుర్తించే విధంగా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

అణువంతటి భావన తెలిసినా

అణువంతటి భావన తెలిసినా విజ్ఞానముగా తెలుపవలెనని
అణువులో పరమాణువంతటి పరమార్థాన్ని తెలుసుకోవాలని
సూక్ష్మములోనే అణువు అర్థాన్ని మహా గొప్పగా గ్రహించాలని
అణువంతటి సూక్ష్మ విజ్ఞానముకైనా పరమార్థ భావంతో నీవు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

ఏ కార్యము పైనను సూక్ష్మ కేంద్ర

ఏ కార్యము పైనను సూక్ష్మ కేంద్ర ఏకాగ్రతతోపాటు
కార్య అవగాహన ఆలోచన విధానము తెలిసినా
అనుభవ సమగ్ర ప్రజ్ఞానంతో మనస్సును ఏకీభవించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

భగవంతున్ని పూజించే విధానమున

భగవంతున్ని పూజించే విధానమున స్వచ్ఛత కావాలని
సూర్యోదయ కిరణాలను నేరుగా నుదుటిని తాకేలా
జీవ భావ గుణాలతో శ్వాసను గమనించడమేనని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

ఓ మాటను తెలపాలని యుగాలుగా

ఓ మాటను తెలపాలని యుగాలుగా ఎదురుచూస్తున్నా
మాట భావనగా మారి స్వభావాలతో విజ్ఞానం చెందుతూ
మహా కార్య విధానాలను కొనసాగించాలని తెలుపుటకు
మహా వ్యక్తికై సరైన సమయం సందర్భం కావాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

ఒక నీటి అణువులో ఎన్నో సూక్ష్మ

ఒక నీటి అణువులో ఎన్నో సూక్ష్మ రసాయనాలు ఉంటాయి
అలాగే మట్టి అణువులలో ఎన్నో సూక్ష్మ గుణాలు ఉంటాయి
ఎంత చిన్న జీవి ఐనా జీవించుటకు మేధస్సు భావాలు ఉంటాయి
ఎన్నో సూక్ష్మమైనవి నీకు తెలియాలని విజ్ఞానంగా విశ్వమున
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

మేధస్సు మర్మము గ్రహిస్తున్నా

మేధస్సు మర్మము గ్రహిస్తున్నా మనస్సు మారుతుందని
సరైన సమయానికి మనస్సే దీర్ఘ ఏకాగ్రతను తప్పిస్తుందని
పూర్వ భావాల ఆలోచనలను గుర్తుచేస్తూ మనస్సే మారును
మనస్సు మన ఏకాగ్రతను మార్చని విధంగా మర్మముకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

అనుకున్న విధంగా అనుకున్న వేళ

అనుకున్న విధంగా అనుకున్న వేళ కలగని భావన కలిగినా
స్వభావాన్ని ఆశ్వాదించని విధంగా సమయానికి వెళ్ళిపోతున్నా
భావనను తిలకించే విధంగా స్వభావాన్ని కలిగించే కాలమే కావాలి
భావన స్వభావాలతో కలిగే అనుభూతి మేధస్సును విజ్ఞాన పరచాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

ఏ కాంతికి తెలియని మహా తెలుపు

ఏ కాంతికి తెలియని మహా తెలుపు వర్ణము నా మేధస్సులోనే
నక్షత్రాలన్నీ గుంపులుగా కలిసినా ఆ తేజస్సు సమముకాదని
చంద్రుని వెన్నల కన్నా మహా స్వచ్ఛమైన తెలుపే నా మేధస్సులో
మీలో నా దివ్య తేజస్సు కాంతి ఓ అణువంతైనా కలగాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

గుణములేని రూపము మెరిసినను

గుణములేని రూపము మెరిసినను తరిగిపోవునని
విజ్ఞానములేని ఆలోచన తెలిసినా నిరుపయోగమేనని
ఆలోచన అజ్ఞానమైనా విజ్ఞానమును గ్రహించవలేనని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

మేఘాలలో కూడా ఎన్నో లోకాలు

మేఘాలలో కూడా ఎన్నో లోకాలు కనిపించేలా నా నేత్రమున దాగి ఉన్నాయి
సూర్య కిరణాలకు మేఘాల లోకాలు కూడా ఎన్నో వర్ణాలతో వెలుగుతున్నాయి
మేఘాల వర్ణ కాంతి దివ్య తేజస్సు రూపాలతో అద్భుతాలను కనబరుస్తున్నది
మేఘపు అంచులు సూర్య కిరణాలకు మహా నక్షత్ర కాంతిని దాచేస్తున్నాయి
సువర్ణ వజ్రాలతో కూడిన మేలిమి మేఘ లోకాలను మేధస్సున దర్శించాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

ఓ మహా రూపం మేఘములలో

ఓ మహా రూపం మేఘములలో మెరుస్తున్నది కాని రూపము కనిపించుటలేదు
ఆకారాన్ని చూడలేని ఆ రూపాన్ని దర్శించాలని నా నేత్రమున ఓ దివ్య భావన
కనిపించని మెరిసే ఆ రూపం వజ్రము కన్నా గొప్ప వర్ణ కాంతులతో ప్రకాశిస్తున్నది
మేఘాలలో దాగిన ఆ మహా రూపం ఓ దివ్య కమలమై శిరస్సున చేరవలెనని
ఆ కాంతులు మేధస్సులో ఆకాశ సూర్య కిరణాలుగా తేజస్సుతో ప్రకాశించాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

నేను అనుకున్నది ఒకటి

నేను అనుకున్నది ఒకటి కాలం కల్పించినది ఎన్నో
నేను ఓ మహా అద్భుత భావనను కోరుకున్నా
కాలం ఆశ్చర్యకర భావనలెన్నింటినో కల్పించినది
కాలం మనకెప్పుడూ గొప్పగా సహకరించాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

Friday, July 9, 2010

మణి రత్నంలో దాగిన మణి శర్మను

మణి రత్నంలో దాగిన మణి శర్మను నేనే
లక్ష్యంతో ఎదుగుతున్న రహమాన్ ను నేనే
వీణలో వాణిని గమనించిన కీరవాణిని నేనే
సంగీతాన్ని మెచ్చే బహుజన రాజ్ కోటిని నేనే
ఇన్నాళ్ళుగా జీవిస్తున్న ఇలయరాజను నేనే
స్వరములోనే దాగిన ఘంటసాలను నేనే
ఇంకా పాడుతూనే ఉన్న బాలును నేనే
సంగీత ప్రపంచమున విశ్వ చక్రవర్తిగా నిలవాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

జీవితాన్ని మరలా ఆశించవద్దని

జీవితాన్ని మరలా ఆశించవద్దని
మరో జన్మ నీకు ఆవసరం లేదని
నేటి జన్మలోనే నీకే అన్నీ తెలిసేలా
విశ్వమున ఆత్మ సిద్ధాంతాన్ని అనుసరించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

సృష్టిలో ఓ వైపు వృక్షములు

సృష్టిలో ఓ వైపు వృక్షములు జనసంఖ్య పెరుగుతున్నా మరోవైపు తరుగుతున్నట్లు
ఓ వైపు మానవ జాలము విజ్ఞానం చెందుతున్నా మరోవైపు మానవులే అజ్ఞానంగా
ఓ వైపు సహజ వనరులు తరుగుతున్నా మరోవైపు కాల ప్రభావము మారుతున్నది
ఏది పెరిగినా తరిగినా మేధస్సున అజ్ఞానం కలిగినా నిత్య సాధనతో విజ్ఞానం చెందాలనే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

విశ్వ విజ్ఞానమున మార్పు లేదని

విశ్వ విజ్ఞానమున మార్పు లేదని మార్చుటకు వీలు కానిదేనని
ప్రతి జీవికి ఒకే సిద్ధాంతముగా ఏనాటికి మార్పు లేని విధంగా
విశ్వ కాలమున మార్పు జరిగినను సిద్ధాంతములో మార్పులేనట్లు
నీవు ఎప్పటికీ ఒకే సిద్ధాంతముతో జీవిచవలేనని తెలియుటకే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

Thursday, July 8, 2010

విశ్వమున సుఖము లేదని

విశ్వమున సుఖము లేదని శూన్యముగా జీవించాలని
రహస్యము మర్మమేనని తెలిసినా తెలియనివి ఎన్నోనని
విజ్ఞానాన్ని మేధస్సు గ్రహించినా కాలం సహకరించదని
గ్రహచారాన్ని తొలగించుకొనుటకు శూన్య భావాలతో
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

ఏమండీ పండితులారా

ఏమండీ పండితులారా మీరేమంటారు ఇక మీరేమంటారు
విశ్వ విజ్ఞానం తెలియుటకు ఆత్మ జ్ఞానం చెందారా
ఆత్మ జ్ఞానంతో జీవించాలని విజ్ఞానవంతులయ్యారా
ఆధ్యాత్మక జీవితం లేదని ఆత్మ జ్ఞానం లేదన్నారా
విజ్ఞానం లేని మేధస్సు నిరుపయోగము కారాదని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

Wednesday, July 7, 2010

విశ్వ జీవిగా జీవించండి

విశ్వ జీవిగా జీవించండి
విశ్వజీవిగా జీవిస్తేనే ప్రతి జీవి మనలాగేనని తెలుస్తుంది
ప్రాణం ఉన్నదే జీవి అన్నప్పుడు మానవుడైనా జంతువైనా ఒక్కటే
జీవులన్నీ ఒకటిగా జీవించాలని విశ్వజీవిగానైనా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

ప్రపంచ యుద్ధము జరగరాదని

ప్రపంచ యుద్ధము జరగరాదని విశ్వ విజ్ఞాన సమగ్ర సారాంశము
విశ్వమంతా మహా అణువులతో కూడినదని ప్రతీది విశ్వ జీవియేనని
మానవ మేధస్సు గొప్పతనం యుద్ధమునకు అవివేకమేనని అజ్ఞాన సారాంశము
ప్రతి జీవి తనలోని శ్వాస జీవియే నని ఆత్మ కర్మల సారంశ సందేశము
ఒక అణువు నుండి విశ్వము ఉద్భవించినట్లు ఒక తల్లి వేరు నుండే మానవ జాలము -
కాలక్రమేణ యుగాలుగా మానవ సమాజము వివిధ ప్రాంతాల నివాస బంధాలతో మార్పు చెందినది -
ప్రతి మానవుడు అందరికి దూర సమీప బంధుత్వ సంభందాలతో జీవిస్తున్నవాడే
కర్మాను సారం మేధస్సు విధాన స్థితి ప్రభావమున మానవ అజ్ఞానమే యుద్ధమునకు దారి తీయును -
యుద్ధమున మరణించు వారంతా బంధుత్వ సంభంద కరుణా మూర్తులేనని కన్నీటి నేత్ర శోకము -
యుద్ధమున పెద్దాయనలు చిన్నాయనలు సోదరులు మేనమామలు గురువులు మనవళ్ళు స్నేహితులు ఋషులు కవులు వైద్యులు మహా విజ్ఞానులే -
శ్వాస సంభందాలను రక్త పాతముతో తెంచరాదనీ పంచభూతాల ధర్మ శాస్త్రము
ఉన్నవాడు లేనివాడు అజ్ఞాన విజ్ఞానులు కలిసే జీవించాలని ఆత్మ జ్ఞాన విశ్వ సారంశము -
అంగవైఖల్యము కలవారు దీర్ఘ కాల రోగులు సమాజమున విజ్ఞానమునే సూచింతురు -
సుఖ దుఖ్ఖాలలో విజ్ఞాన ఎరుక ఉండాలనే మానవ మేధస్సు తెలుపుతుంది
కాలం ఎప్పుడూ అజ్ఞానాన్ని సూచిస్తుందని మానవుడే నిత్య విజ్ఞాన ధర్మనీతి సారాంశముతో ఎదగవలేనని సూచన -
విశ్వమున భయంకరాన్ని మానవులే యుద్ధముగా సృష్టిస్తే విశ్వకాలమే ఘోర ప్రళయాన్ని సృస్టించగలదు -
విశ్వమున నీకేది అర్థము కాకుంటే పరమార్థము తెలియుటకు ఆత్మ జ్ఞానము చెందాలని -
"మహాభారతము" తెలియకున్నను "విశ్వ భారతము" తెలియాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

విశ్వ జీవులలో నేనొక చిరంజీవిని

విశ్వ జీవులలో నేనొక చిరంజీవిని
విశ్వ జీవిగా జీవించుటలో నేనొక జీవిని
ప్రతి జీవిలో నేనొక శ్వాస జీవినే
శ్వాస ఉన్నంతవరకు నేను చిరంజీవినే
విశ్వమున చిరంజీవిగా నిలుచుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

Monday, July 5, 2010

మేఘాలలోని భావాలు కూడా

మేఘాలలోని భావాలు కూడా నా మేధస్సులో ఉన్నాయి
మేఘ వర్ణ రూపాలు కూడా నాలో విజ్ఞానాన్ని తెలుపుతాయి
వర్ణ స్వభావాలు కూడా విశ్వ భాషతో తెలియాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

జీవితంలో ఏదీ తోచకపోతే

జీవితంలో ఏదీ తోచకపోతే నా భావాలను తెలుసుకో
నా భావాలలో ఓ భావాన్ని ఆకాశంలో తిలకించు
కనిపించే రూపంలో కలిగే మహా దివ్య విజ్ఞానముకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

అణువుల అలజడితో ఎన్నో రూపాలు

అణువుల అలజడితో ఎన్నో రూపాలు మారేలా
భావాల విజ్ఞానంతో స్వభావాలను మారుస్తూ
నూతన సాంకేతిక విజ్ఞానాన్ని తెలుసుకుంటూ
జీవించుటలో ఆత్మ విజ్ఞానం తెలియక పొతే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

సత్యమంతా ఆకాశంలోనే

సత్యమంతా ఆకాశంలోనే దాగి ఉన్నట్లు
జీవితమంతా శ్వాసలోనే దాగి ఉందని
నీ ఆత్మ నీకు తెలుపకపోయినా నా భావనతో
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

మీ శేష జీవితానికి నా భావాలు

మీ శేష జీవితానికి నా భావాలు లేకపోతే జీవితమంతా శూన్యమే
నా భావాలు కొన్నైనా తెలుసుకుంటే మేధస్సులో ఓ దివ్యాలోచన
ఆత్మాలోచన లేని భావాలు జీవితంలో లేకపోతే విశ్వవిజ్ఞానం లేనట్లే
విశ్వాత్మలోచన లేకపోతే జన్మించుటలో తెలియనిది జీవితంలో తెలియకనే
మరణించుటలో నీ జన్మ జీవిత కారణ భావాలు విశ్వాత్మకు తెలిసేలా జీవించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

నా మేధస్సులో నిశబ్ధమైన సంగీతం

నా మేధస్సులో నిశబ్ధమైన సంగీతం ప్రవహిస్తూ శ్వాసలో కలుస్తున్నది
శ్వాసలోని సంగీత నాదం విశ్వ భావాలతో దివ్య స్వభావాలను కలిగిస్తున్నది
మేధస్సులో విజ్ఞానం ఓ పర్వత లోక దీవిగా ఎదుగుతూ ఆకాశాన్ని తాకుతున్నది
సంగీత ప్రవాహ విశ్వ విజ్ఞానం మీ మేధస్సులో దివ్య కాంతితత్వ తేజస్సుతో చేరుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

శరీరానికి కొత్త రోగం కలగకుండా

శరీరానికి కొత్త రోగం కలగకుండా పాత రోగాన్ని వదిలించుకో
ఏ ఆశ లేకుండా జీవిస్తూ పోతేనే పాత రోగం నిశించిపోతుంది
దీర్ఘకాల రోగమైనా నశించేలా ఆశలేని భావాలను ఆలోచించు
నిర్మలమైన ఆకాశాన్ని ఎంత ఎక్కువగా చూస్తే అంత ఆరోగ్యం
నిత్యం ఆరోగ్యంగా ఉండుటకు మహా స్వచ్ఛమైన భావాలు కలిగేలా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

Sunday, July 4, 2010

అద్భుతమైన రూపాలను

అద్భుతమైన రూపాలను తిలకించుటకే విశ్వంలో ఉదయించా
ఆకాశాన్ని చూడాలనే నా నేత్రాలు పై దిక్కును చూస్తున్నాయి
ఆకాశంలో దివ్య నక్షత్ర తేజస్సు నా మేధస్సునే మెరిపిస్తున్నది
ఆలోచనలు కూడా తళుకుమనేలా నేత్రాలలో కాంతి కలిగేలా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

జీవితాన్ని తిరగేసి

జీవితాన్ని తిరగేసి వ్రాసుకోవాలనుకున్నావా
ఆత్మ సిద్ధాంతాన్ని మార్చుకోవాలనుకున్నావా
విశ్వ జీవితానికై జీవించుట కోసమైనా నీవు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

నాలో శ్వాస ఉన్నా నేను గాలిలో

నాలో శ్వాస ఉన్నా నేను గాలిలో ఉన్నాను
గాలిలా విశ్వమంతా ప్రయాణిస్తూ ఉంటాను
గాలితోనే ఆకాశాన్ని తాకుతూ జీవిస్తాను
మేఘాలను కదిలిస్తూ కాలంతో సాగేందుకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

చంద్రుడు అర్దాకారంలో ఉన్నప్పుడు

చంద్రుడు అర్దాకారంలో ఉన్నప్పుడు అంచున ఉండే దివ్య నక్షత్రాన్ని నేనే
విశ్వాత్మ రూపాలలో ఓ అద్భుత రూపంగా వెలిగే విశ్వ తార కాంతిని నేనే
మహా రూపాలతో మారే ఆకాశ వర్ణ ప్రభావాల కాల చీకటి వెలుగునూ నేనే
విశ్వమే నేనై విశ్వమంతా భావ స్వభావాలతో జీవించాలని నీవనుకున్నా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

ఎవరూ లేనిచోటైనా ఎవరూ

ఎవరూ లేనిచోటైనా ఎవరూ లేనప్పుడైనా ఎవరైనా జీవించగలరా
విశ్వ భావ స్వభావాలు ఉన్నవారే జీవించగలరని నా ఆలోచన
ఆత్మ విజ్ఞానము కలవారికే విశ్వ భావ స్వభావాలు కలుగుతాయి
ఎలాగైనా జీవించుటకు ధ్యానించుటలో విశ్వ భావస్వభావాలు కలిగేలా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

విశ్వానికి నా మొదటి లేఖ

విశ్వానికి నా మొదటి లేఖ
ప్రపంచాన్ని మార్చేందుకు నే తెలుపుతున్న భావన
నా ఆశయాన్ని విశ్వానికి తెలుపుటకు ఆహ్వానించండి
సమయం ఆసన్నమైన వేళయేనని గ్రహించండి
నన్ను తెలుసుకొనుటకు నన్ను కలుసుకోండి
ప్రతి జీవిలో మార్పు రావాలని మీకోసం మీరైనా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

Saturday, July 3, 2010

ఏకాగ్రత ప్రశాంతంగా ఉన్నప్పుడే

ఏకాగ్రత ప్రశాంతంగా ఉన్నప్పుడే కలిగినట్లు
ధ్యాస శ్వాసపై ఉన్నప్పుడే గమనం తెలియును
శ్వాసను గమనించుటలో కలిగే విజ్ఞానముకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

ఆరంభం ఆలస్యమే గాని మొదలైతే

ఆరంభం ఆలస్యమే గాని మొదలైతే సాగిపోతూనే
ఏ కార్యమైనా ఆరంభానికే ముందే సమయం
ఆరంభమైన తర్వాత కాలంతో సాగిపోతుంటుంది
కార్యాన్ని సరైన సమయంలో ఆరంభించడానికి ఆలస్యం వద్దు
అనుకున్న కార్యాన్ని అనుకున్న సమయంలో ఆరంభించండి
ఆలస్యమైతే మరల ఆరంభం కావడానికి సంవత్సరం పట్టవచ్చు
ఆలస్యం సంవత్సరమైనా అంతం కావడానికి కూడా సంవత్సరమే
ఏ కార్యాన్ని ఎప్పుడు ఎలా ప్రారంభించాలో తెలుసుకోవడానికి
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

మౌనం ఎప్పుడూ నిదానమే

మౌనం ఎప్పుడూ నిదానమే
నిదానమే ప్రదాన అంశము
నిదానమే ఏకాగ్రతకు మార్గం
ఎకాగ్రతయే ప్రశాంతమైనది
ప్రశాంతమే విజ్ఞాన శాంతి
శాంతితో జీవించుటయే జీవితం
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

విశ్వమంతా చీకటైనా నీ మేధస్సు

విశ్వమంతా చీకటైనా నీ మేధస్సు చీకటి కారాదని
విశ్వమంతా అజ్ఞానులైనా నీవు అజ్ఞాని కాకూడదని
విశ్వమంతా విశ్వ విజ్ఞానమే కావాలని నీ మేధస్సుకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

అంతా విశ్వమేనని విశ్వంలో

అంతా విశ్వమేనని విశ్వంలో జన్మించాము
విశ్వమే మనదని విశ్వమంతా జీవిస్తున్నాము
విశ్వ విజ్ఞానమే మన జీవితమని తెలియుటకైనా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

ఎవరికి వారు జీవిస్తే సమాజం

ఎవరికి వారు జీవిస్తే సమాజం అదోగతే
నీ కోసం జీవిస్తే కుటుంబమైనా విడిపోతుంది
నీ ఒక్కడి కన్నా ప్రతి ఒక్కరి సంతోషానికై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

విశ్వ విజ్ఞానముకై ఆలోచనలను

విశ్వ విజ్ఞానముకై ఆలోచనలను మార్చుకో
ఆలోచనలలో కలిగే విజ్ఞానాన్ని తెలుసుకో
మరో జ్ఞానికి తెలియని సత్యాన్ని గ్రహించుటకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

హాని లేనిచోట ప్రశాంతత ఉంటుంది

హాని లేనిచోట ప్రశాంతత ఉంటుంది
ప్రశాంతమైన ప్రాంతమే విజ్ఞానంగా
విజ్ఞానమే విశ్వానికి మహా స్పూర్తి
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

ఓ మనిషి ఆలోచనలతో

ఓ మనిషి ఆలోచనలతో మారుతున్నారంటే అతనే మహాత్మా
మౌనమే ఏకాగ్రతనిచ్చే ప్రశాంతతయని అతని విజ్ఞాన సందేశం
ప్రశాంతతో "శాంతి" ని విశ్వంలో ప్రతి జీవికి అందిస్తూ ఉన్నారు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

ఒకరు ఆలోచనలతో మారుతున్నారంటే

ఒకరు ఆలోచనలతో మారుతున్నారంటే ఆ ఆలోచనలు మహా గొప్పవేనని
ఆ ఆలోచనల మార్పులో విజ్ఞానం ఉంటే మరొకరు మారడానికి అవకాశం
ఒక్కక్కరు మారుతూపోతే ప్రపంచంలో ఏ జీవికి హాని జరగదనే నా విశ్వాసం
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

ముందు ఓ మనిషి ఆలోచనలు

ముందు ఓ మనిషి ఆలోచనలు మారాలి
అ తర్వాత అతనిని చూసి ఇంకొకరు మారాలి
అలా ఒక్కొక్కరు మారుతూపొతే అందరూ మారుతారు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

విశ్వమంటే మట్టి కాదోయ్

విశ్వమంటే మట్టి కాదోయ్ విశ్వమంటే విజ్ఞానమోయ్
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మహాత్ములోయ్
నగరమంటే మట్టి కాదోయ్ నగరమంటే నాగరికతేనోయ్
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

Friday, July 2, 2010

మౌనంగానే ఉన్నానని నాలో అజ్ఞానం

మౌనంగానే ఉన్నానని నాలో అజ్ఞానం లేదే
మాట లేకున్నా మనస్సు లేనివాన్ని కాననే
నా ధ్యాసలో నేనున్నా మీరంతా నాలోనే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

Thursday, July 1, 2010

Breath is in Yours

Breath is in Yours for getting an Enlightment -
For everthing you get an enlightment otherwise you will have confusion in your Mind -
With any small confusion in mind you will not get the fullfedged Knowledge -
If You have the confidence in universal knowledge your perfect otherwise you should get an enlightment -