ఎంత కాలం జీవించినా తీరని ఆశయాలతో ఆలోచిస్తూనే జీవనం సాగిస్తున్నాం
కాల పరిస్థితులతో పాటు ఆశయాలు మారుతూ ఏ ఆశయం నెరవేరక పోతుంది
ఆశయాలు గొప్పవైనా చిన్నవైనా కాల పరిస్థితులను తొలగించే సాధన కావాలి
సాధన ఉన్నా కాలం సహకరించకపోతే జీవితమంతా వ్యర్థమై నిరాశ భావాలతో
ఆశాజీవిగా జీవిస్తూనే ఆశయాలతో కాలాన్ని గడుపుతున్నామనే జీవన జీవితం
ఆశయం లేకుండా జీవించే మేధస్సు విశ్వంలో ఉండదనే నాలోని మహా భావన
No comments:
Post a Comment