నా మేధస్సులోని కణాల చలనాన్ని నేను సూక్ష్మంగా గ్రహిస్తున్నాను
నా శిరస్సులోని అవయవాల కదలికలు మేఘాలవలె నాకు తెలిసేలా
హాయిగా ప్రకృతి గాలిలో ఉన్నప్పుడు కలిగే మేధస్సు భావం కదిలేలా
చల్లని గాలిలో మేధస్సుకు హాయి కలిగితే ఆ భావానికి ఆలోచన లేదు
ఆలోచనలేని మేధస్సు ఎంత కాలమైనా ఉత్తేజ ఉత్సాహంగా ఆనందంతో
ఆలోచన లేకున్నా మనలో కలిగే ఆ ప్రశాంతత మహా స్వభావ భావంతో
ఆ సమయాన నాలో కలిగే భావాలోచనలు మహా దివ్యంగా ఉంటాయి
No comments:
Post a Comment