ఒక అణువులో కూడా మహా మర్మమున్నదని అందుకే సృస్టించబడిందని నా ఆలోచన -
అణువులతోనే వివిధ రూపాలు వివిధ పరిణామాలతో వివిధ ప్రాంతాలలో వెలిసి ఉన్నాయి -
అణువులలోని వివిధ భావ స్వభావాలతోనే రూప వర్ణ గుణాలలో ఎన్నో మార్పులున్నాయి -
అణువులో అన్వేషిస్తే పరమాణువులో కూడా మహా భావస్వభావాలు ఎన్నో విధాలుంటాయి -
అణువులో కూడా మహామర్మ విశ్వవిజ్ఞానం ఉందని నా మేధస్సులో భావాలు కలుగుతాయి -
No comments:
Post a Comment