మహా మర్మ రహస్యం ఏదైనా ఉంటే దానినే మహా విశ్వవిజ్ఞానంతో ఆలోచించండి
యుగాలుగా ప్రతి క్షణం అదే ధ్యాసతో విశ్వ భావాలతో సూక్ష్మంగా గమనించండి
ఏ కార్యాన్ని చేస్తున్నా ఓ వేద శాస్త్రీయ గమనం మన శ్వాసలో తపిస్తూ ఉండాలి
మూల కార్యకారణ సిద్ధాంతము ద్వారా క్రమకార్య ప్రణాళికతో మర్మమే తెలుస్తుంది
అవగాహన మూలాధారంపైననే ఉంచి కారణ రీతితో ఆలోచిస్తే ఓ చిక్కు పడిపోతుంది
ఆలోచనలో పడే ఆ చిక్కును సూక్ష్మంగా విప్పగలిగితే మహా మర్మము తెలుస్తుంది
మనం ఏదైనా తెలియకపోతే మహా మర్మమేనని తెలిస్తే ఇంతేనా అని ఆలోచిస్తున్నాం
తెలియనంత వరకు ఆశ్చర్య అద్భుతమే తెలిసిన తర్వాత చాలా సాధారణ విషయంగా
మర్మం తెలిసిన దానిని ఇంకా పరిశీలిస్తూపోతే మూల రహస్యం మేధస్సులో కలుగుతుంది
భగవంతునికి కూడా తెలియని మర్మ విషయాలు విశ్వంలో ఎన్నో ఉన్నాయని నా మేధస్సులో
No comments:
Post a Comment