ప్రతి అణువులో ప్రాణం ఉందనే నా ప్రాణం తెలుపుతున్నది
ప్రాణం లేనిది భావ స్వభావాలతో సైతం కనిపించదు ఉండదు
కనిపించక ఏ భావం మనకు కలిగినా ఏదో ప్రాణంతో ఉందనే
గాలిలా కనిపించని ధూళి సూక్ష్మ జీవులు ఎన్నో రకాలుగా
వాసనలో కూడా ఓ జీవం ఉందనే అది గాలిలా జీవిస్తుంది
ప్రాణం ఉన్నందునే అణువులో భావ స్వభావాలు ఎన్నెన్నో
శూన్యముగా కనిపించని సూక్ష్మ పరమాణువులున్నాయి
మన కంటికి కనిపించని ప్రాణులు ఎన్నో విధాల ఎక్కడెక్కడో
శబ్దాలలో కూడా జీవించే ప్రాణ జీవులెన్నో మనకు తెలియవు
ఒక జీవిలో కూడా ఎన్నో సూక్ష్మ కణ ప్రాణ జీవులుంటాయి
అణు సిద్ధాంతము తెలిసినా అది పరమాణువంతటి విజ్ఞానమే
No comments:
Post a Comment