ఏ ప్రభూ! విశ్వము నేనే విశ్వాత్మను నేనే
విశ్వమున ప్రతి అణువు నాదేనని నేనేనని
గుణ భావాలు నావే గుణా తత్వ స్వభావాలు నాలోనే
ప్రతి రూపంలో నేనున్నానని గ్రహించలేక అజ్ఞానులుగానే
వేద భావాలు లేక మేధస్పందనను గుర్తించలేకున్నారు
ప్రతి జీవిలో అజ్ఞానము అమితముగా నిండి యున్నట్లు
విజ్ఞానము లేక విశ్వము తెలియని ఆంధః కార ధ్యాసలో
గ్రహస్థాన గ్రహాచార కాలానికి బలి అవుతున్నా అదే ధ్యాస
గ్రహ దోషాలను తొలగించే ఏకైక దివ్య కాల చక్రాన్ని నేనే కదా
నేనే విశ్వమని ప్రతి రూప స్వభావాలతో ఏనాడైతే జీవించగలరో
ఆ క్షణం తానే విశ్వ విధేయుడిగా విశ్వముననే నిలిచిపోతాడు
నన్ను గ్రహించని జీవికి ఆత్మధ్యాస లేక విజ్ఞానము మలినముగానే
దేహమున ధ్యానించని ఆత్మకు మరో కర్మ జన్మ తప్పదు వీడదు
సత్యమున ఆసక్తి లేనివాడు ఆత్మ జ్ఞానమునకు అనర్హుడే
" ప్రభు : విశ్వమే తానై తెలుపుకున్న విధేయత భావము "
No comments:
Post a Comment