Monday, June 21, 2010

కాలం ఎప్పుడూ అజ్ఞానంగానే

కాలం ఎప్పుడూ అజ్ఞానంగానే ఉంటుందని ప్రతి క్షణం గమనించు
కాలం అజ్ఞానమేనని వివిధ సమస్యలతో తెలుస్తూనే ఉంటుంది
ప్రతి కార్యములో ఏదో ఒక తప్పు లేదా అజ్ఞాన భావం కలుగుతుంది
కాలం ఏదో ఓ విధంగా అజ్ఞానం కలిగించేలా క్షణాలలో తెలుస్తుంది
సూక్ష్మ కార్య విధానాన్ని పరిశీలిస్తే ఎన్నో తప్పులు తెలుస్తాయి
సూక్ష్మ కార్య కారణాలోచన లేక కార్యములలో అజ్ఞాన కార్యాలు
ఒక వస్తువు పడిపోయే విధానము సరికాకపోతే అజ్ఞానమే కదా
ఒక పదార్థాన్ని సరిగా ఉపయోగించుకోలేదంటే అజ్ఞానమేనని నేను
సమస్యలే అజ్ఞానమని వాటిని సరి చేసే కార్యాలే విజ్ఞానమని నాలో
ఒక వస్తువు యొక్క అజ్ఞాన కర్మ తత్వాన్ని కూడా తెలుసుకోవచ్చు
ఓ వస్తువు ఉపయోగపడే విధానమున దాని అజ్ఞాన కర్మ తెలుస్తుంది
ఒక వస్తువు మన ద్వారా నిరుపయోగమైనా మనకే అజ్ఞాన కారణ కర్మ
విశ్వ కాలమున ఏ జీవికైనా ప్రతీది అజ్ఞాన కార్యంగానే మొదలవుతుంది
ప్రతీది విజ్ఞానంగా చేయాలంటే మేధస్సులో క్రమ కార్య కారణ విధానం ఉండాలి

No comments:

Post a Comment