విశ్వం ఆగిపోతుందన్న విషయం ఎవరికి తెలుపకు
విశ్వం ఆగే సమయాన ఎవరూ జీవంతో ఉండలేరు
విశ్వమునకు ముందే ప్రతీది పంచభూతాలలో కలిసేను
శూన్యముగా విశ్వము ఒకే అణువుగా మారుతుంది
అణువు యొక్క శూన్య తత్వమే పరమాత్మ భావం
పరమాత్మను దర్శించాలంటే విశ్వం శూన్యం కావలసిందే
దర్శించేందుకు నీకు ప్రదేశమైనా ఆకారనేత్రమైన ఉండాలే
శూన్యమున ఏదీలేని నీవు భావనగానే దర్శించగలవు
నీలో పరిశుద్ధమైన ఆత్మతత్వం ఉంటేనే పరమాత్మ దర్శనం
ఆత్మ భావనకు ఆకార ప్రదేశాలు అవసరం లేవనే నా ఆలోచన
No comments:
Post a Comment