భగవంతునికంటే గొప్పగా ఆలోచించు మేధస్సుతో విశ్వమున మర్మ రహస్యాలనే అన్వేషించు -
ఏ మహాత్మకు తెలియని మరో రహస్యమే అంతరిక్షమున మహా భావ వేద విజ్ఞానంతో పెకలించు -
విశ్వాత్మకు కూడా తెలియని విధంగా రహస్యాలను నీ మేధస్సులో సూక్ష్మముగా గ్రహించు -
శ్వాసలో కలిగే మొదటి భావన ఎలా కలుగుతుందో ఆ జీవం ఎక్కడిదో విశ్వమున గమనించు -
భగవంతుడు కూడా నీ మేధస్సులో అన్వేషించేలా నీ ఆలోచనలను విజ్ఞాన కాంతిగా వెలిగించు -
నీ ఆలోచనలలో ఉన్న రహస్య అన్వేషణయే నీ మేధస్సును విశ్వములో కేంద్రీకృతం చేయును -
నీ మేధస్సే విశ్వమునకు దివ్య జ్ఞాన స్వభావాన్ని కలిగించేలా ఆలోచనలలో కాంతి తరంగాలే -
నీ మేధస్సుకై ఆనాటి మహాత్ములు మరల నీతో జీవించుటకు మరో జన్మగా ఉదయిస్తున్నారు -
నీ ఆత్మను రహస్యముగా విశ్వాంతరముననే నిలిచేలా మహా భావనను దివ్యత్వంతో స్మరించు -
No comments:
Post a Comment