Tuesday, June 8, 2010

మన మేధస్సులో ఆలోచనలు

మన మేధస్సులో ఆలోచనలు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాయి
కొన్ని ప్రయోగాలు పూర్తయితే విజ్ఞానంగా మనకు తెలుస్తాయి
పూర్తికాని ప్రయోగాలు అలాగే అజ్ఞానంగా మేధస్సులోనే ఉండిపోతాయి
కొన్ని ప్రయోగాలను వివిధ కార్యాలతో మనం చేస్తూ విజ్ఞానం చెందుతాం
కొన్ని ప్రయోగాలు చేస్తున్నా ఫలితాలు లేక మధ్యలో అలాగే ఆగిపోతాయి
మధ్యలో ఆగిన ప్రయోగాలన్నీ మేధస్సులోనే అజ్ఞానంగా ఉండిపోతాయి
కొన్ని ప్రయోగాలను చేయడానికి వీలు ఉండదు అలాగే సదుపాయాలు ఉండవు
సరికాని ఆలోచనల ఉపాయాలతో ప్రయోగాలు ఫలించకపోతాయి
సరైన ఆలోచన ఉపాయాలున్నా కొన్ని ప్రయోగాలను చేయలేకపోతాం
కొన్ని ప్రయోగాలను మొదలు పెడితేనే మధ్యలో మరి కొన్ని ఉపాయాలు తెలుస్తాయి
ఎన్ని ప్రయోగాలు చేస్తే అంత విజ్ఞానంగా మేధస్సు ఎదుగుతుంది
కొన్ని ఆలోచనలు నిద్రలో ఎన్నో ప్రయోగాలను చేస్తూ ఉంటాయి
ఆలోచన విజ్ఞానం ఎవరికి ఎలా ఉంటె ప్రయోగాలు అలా సాగుతూ పోతాయి
ప్రతి కార్యం ఒక ప్రయోగంలా మన మేధస్సులో ఆలోచనలు చేస్తుంటాయి
ఆనాడు మరణించిన వారిలో ఎన్ని ప్రయోగాలు ఎలాంటివి ఎలా ఆగిపోయాయో
ఆగిన ప్రయోగాలన్నీ నిర్వర్తించి ఉంటే ఎలాంటి అద్భుతాలు ఏనాడో జరిగేవేమో
ఎవరి మేధస్సులో ఎలాంటి ప్రయోగాలు అలాగే చేయక ఉండిపోయాయో తెలియలేదే
ఆనాడు ఆగిన ప్రయోగాలను మరల ఇంకొకరి మేధస్సులో పని చేసేలా నే కలిగిస్తాను
పూర్వం నుండి నేటి ఆధునిక సాంకేతిక విజ్ఞానం మేధస్సులోని ఆలోచనల ప్రయోగ కార్యాలే

No comments:

Post a Comment