Tuesday, June 1, 2010

ఏ రూపంలేని జీవితం

ఏ రూపంలేని జీవితం ఎవరికి తెలుస్తుంది
చూడటానికైనా ఆకారము ఉండాలి కదా
రూపం లేకున్నా దాని భావన తెలిసేదెలా
భావన కలిగేందుకైనా స్వభావమైనా తెలియాలి
స్వభావంతో మరో రూపానికి స్పర్శైనా కలిగించాలి
స్పర్శ కలిగించుటలో రూపం కనిపించకున్నా ఉందనే
ఉన్నదని భావం కలిగితే చాలు గాలిలా జీవిస్తుందని
గాలిలా జీవించేవి సృష్టిలో ఎన్నున్నాయో మర్మమే

No comments:

Post a Comment