నేను ఎన్ని వేల మైళ్ళు దూరమున్నా నా జీవితాన్ని గ్రహించండి
నా జీవన విధానం ఎలాంటిదో నేను ఎదిగిన రీతి మీకు తెలిసినదేగా
నా భావాలను గ్రహిస్తే నేను ఎలా శ్రమిస్తానో ఆలోచనగా తెలుస్తుంది
నన్ను కోరే వారికి ఎన్ని యుగాలైనా నా భావాలు మీకు దగ్గరగానే
నా భావాలు ఉంటే నేను ఏ లోకాన ఉన్నా మీకు ఆత్మీయుడిగానే
మీ వారు ఎక్కడ ఎంత కాలం ఎలా ఉన్నా భావాలను గ్రహించండి
No comments:
Post a Comment