ఒక రూపాన్ని విశ్వంలో ఎక్కడ నుండైనా చూడగలుగుతాను
ఎంత దూరమైనా ఏ వర్ణాకారములో ఉన్నా ఏ సమయమైనా
విశ్వంలో ఏ రూపమైనా అణువు ఐనా నాకు కనిపించేవిధంగా
ఏ లోకాన ఎలాంటి రూపమున్నా నాకు తెలిసిన అడుగుజాడలో
నేను సృష్టించుకున్న భావాలతో ఏ రూపాన్నైనా ఎక్కడనుండైనా
ఏ రూప భావాలైనా స్వభావాలుగా నన్ను చేరేలా నాకు తెలిసేలా
నా భావాలతో నేనే సృష్టించుకున్న రూపాలుగా నేనే అమర్చినట్లు
ప్రతి రూపాన్ని నేనే అమర్చినట్లు నేనే ప్రతీది చూడగలుగుతున్నా
No comments:
Post a Comment