Tuesday, June 1, 2010

మనస్సుతో ఆలోచనలు వెళ్ళుతుంటే

మనస్సుతో ఆలోచనలు వెళ్ళుతుంటే వివిధ కార్యాలతో భావాలను కలిగిస్తూ స్వభావాలను తెలుపుతూ మేధస్సును స్పందింపజేస్తుంది -
మనస్సు ఆలోచనలతో ఏ కార్యాలను ప్రతి క్షణం అన్వేషిస్తుందో దానికి అనుగుణంగా భావ స్వభావాలు మేధస్సులో ప్రభావితమౌతాయి -
మనస్సు ఎలా ఎంత కాలం ఏ కార్యాలతో ఆలోచిస్తూ ఉంటుందో అలాగే మనలో విజ్ఞానం అలాంటి కార్య సాధనలో ఎదుగుతూ ఉంటుంది -
మనస్సు ఏ ఆలోచనలపై దృష్టి పెడుతుందో మన విజ్ఞానమే మనకు తెలిపేలా మనస్సును మనమే మన ఆశయాల దారిలో తిప్పుకోవాలి -
విజ్ఞానంగా మనస్సును గ్రహించే వరకు మనం ఎదిగిన విధానం ఎలా ఉన్నా ఆ తర్వాత ఆలోచనలను ఆశయాల వైపు మలుచుకోవాలి -
ఆశయం లేని జీవితం ఎలా ఉంటుందో ఏ మార్గాన వెళ్ళుతుందో మనస్సుకు కూడా తెలియక విశ్వ విజ్ఞాన కాలం వృధాగా గడిచిపోతూనే -

No comments:

Post a Comment