నా మేధస్సులో ప్రతి కణం ఓ మహా దివ్య ప్రకాశ నక్షత్రమువలె మెరుస్తున్నది
మెరిసే కాంతులలోనే ఆలోచనలు వివిధ భావాలతో విశిష్టతగా కలుగుతున్నాయి
సువర్ణ తేజస్సు భావాలతో కూడిన అద్భుత ఆలోచనలు మేధస్సుకే అద్వితీయం
నా మేధస్సు కూడా ఆకాశంలా వివిధ నక్షత్ర చంద్ర కాంతులతో మెరుస్తున్నది
అంతరిక్షములా నా శిరస్సు అత్యంత భావాలతో మహా లోకాలలో తేలిపోతున్నది
నేనెక్కడ ఉన్నా నా ఆలోచనలు విజ్ఞాన కాంతులుగానే ప్రకాశిస్తాయని నా భావన
No comments:
Post a Comment