Friday, June 18, 2010

జటా జూటాల ముడి విప్పి

జటా జూటాల ముడి విప్పి ఆకాశాన ఎగురుతూ అడుగులు వేస్తుంటే మేఘాలు డీకొని వడగండ్ల కురిసేలా -
మెరిసే మెరుపులకు నా ముఖము భయంకర విశ్వాగ్ని గోళంగా పిడుగులు అదిరేలా భూలోకం దద్దరిల్లేలా -
నా రూప భావాలకు రాక్షసులు మూర్చపోయి స్పృహలేక మరో ధ్యాసలో మతి చెదిరి విజ్ఞానవంతులైనారు -
సామాన్య మానవుడు నా రూప నీడను చూడని విధంగా విశ్వమంతా భయానక ధ్వనులతో మ్రోగుతున్నది -
దిక్కులు తెలియని విధంగా మహా ప్రళయాలు సంభవించేలా ఏ దారిలేని గంగా ప్రవాహం ఆకాశపు అంచులుగా -
విశ్వ కాలమున ఏది ఎప్పుడు సంభవిస్తుందో ఏ విజ్ఞానానికి తెలియని విధంగా ప్రకృతి ప్రభావాలు కలుగుతాయనే -

No comments:

Post a Comment