Monday, June 21, 2010

మహా ధ్యాసలో ఉన్నా

మహా ధ్యాసలో ఉన్నా మహా భావంతోనే జీవిస్తున్నా
మాటైనా లేదు రూపంలో కదిలే భావమైనా లేనేలేదు
నేత్రాలు చూస్తున్నా కనిపించే మహా రూపం తెలియదే
ఆలోచన కలిగినా సూక్ష్మ విజ్ఞానికి కూడా అంతు చిక్కదే
నా వారు నన్ను తాకినా నాలో స్పర్శైనా చలించుట లేదే
ఎందరో మహాత్ములు నన్ను దర్శించినా నా ఆత్మ ఏమిటో
శరీరంలో లీనం మనస్సులో జీవం మేధస్సులో యద్భావమే
భావమే శూన్యం శ్వాసే ధ్యానం ఆలోచన ఏ మౌనార్థమో
ఏ ధ్యాసలో ఉన్నా విశ్వమున అన్వేషణ సాగిస్తున్నానని
ఆనాడే నా రూపాన్ని విశ్వమున తిలకించారు వేదాలలో
నా శ్వాసతోనే ప్రతి రూపం జీవిస్తున్నా నేనెవరినో ఎవరికి తెలియదే
యుగాలుగా సాగే నా శ్వాస ఆరని జ్యోతిలా వెలుగుతున్నది ఎందరిలో

No comments:

Post a Comment