ఆకాశాన అన్ని వర్ణాలుగల మేఘం వెళ్లిపోతుంటే నా ఆలోచనలు కూడా దానితో సాగుతున్నాయి -
మేఘాలతో ప్రయాణిస్తూ విశ్వంలో ఎన్నో వర్ణాలుగల రూపాలను చూస్తూ భావాలతో తిలకిస్తున్నాను -
నేత్రాలకు అందనంతగా మేఘాల అంచులు ఆకాశాన వివిధ రూపాల పరిణామాలతో మారుతున్నాయి -
సూర్య కిరణాలకు మేఘ వర్ణాల తేజస్సు నా మేధస్సులో చేరి ఆలోచనలను ఉత్తేజ పరుస్తున్నది -
మేఘ వర్ణాలతో కలిగే ఆలోచన స్వభావాలు విశ్వ తత్వాన్ని తెలిపేలా నా మేధస్సులో ఉండిపోయాయి -
మేఘ ప్రభావాలతో మెరిసే మెరుపులు పిడుగులు భయంకర ధ్వనులు నా చెవిలో చేరియున్నాయి -
No comments:
Post a Comment