అందరు కలిసే ఉందాం స్నేహ భావంతోనే జీవిద్దాం
అందరి భావాలను తెలుసుకొని విజ్ఞానంగా వెలుగుదాం
ప్రపంచమంతా ఒకే భావాలతో స్నేహ సంబంధాలతో కలిసే ఉందాం
ఎవరికి ఏది కావాలో ఎలా ఉండాలో నిర్ణయించుకొని ఆశయాలతో సాగుదాం
సమాజానికి ప్రకృతి ప్రభావాలకు తగ్గట్లు విశ్వ విజ్ఞానంతో ఎదుగుతూ జీవిద్దాం
ఆత్మజ్ఞానం లేని విజ్ఞానాన్ని వీడి నవ సమాజ సంస్కృతితో సాంకేతిక పరిజ్ఞానంతో మెలుగుదాం
సమస్యలు లేని విధంగా కాల క్రమేణ వృత్తి రిత్యా జీవన కార్యక్రమాలతో జీవనాన్ని ముందుకు సాగిద్దాం
No comments:
Post a Comment