ఆకలిని తీర్చలేని అనంత విశ్వ భావనలు నాకెందుకు
ఎన్నో విజ్ఞాన భావనలు కలిగించినా ఈ భావన కలగటం లేదే
ఇలాంటి విజ్ఞాన భావన విశ్వంలో ఇంకా ఎవరికీ కలగలేదా
శ్రమించుటకే ఆహారమైతే ఆహారం లేకున్నా నేను శ్రమిస్తాను
నా శ్రమలో విజ్ఞాన కరుణ లేదనే ఆ భావనను కలిగించటం లేదా
ఆకలిని తీర్చే భావనకే నేను యుగాలుగా శ్వాసతో జీవిస్తున్నా
ఆహారంతో జీవించే జీవితం నా భావాలలో లేదనే తెలుపుతున్నా
నాలో ఆహారం ఉన్నంత వరకు సృష్టిలో అమృత భావన లేదనే
ఆకలిని తీర్చే భావనకై ప్రతి విశ్వ రూప భావ స్వభావాలలో అన్వేషిస్తున్నా
ఏ రూప భావంతో నేను ఆకలిని తీర్చుకుంటానో ఆ రూపమే పరమాత్మగా
నిరంతర విశ్వ రూపాల అన్వేషణ ఆత్మ తత్వాలలో కూడా కొనసాగిస్తున్నా
No comments:
Post a Comment