మనస్సే మర్మమని మనస్సులోనే దాగినది ఆలోచనకు తెలియక
మేధస్సు గ్రహించలేనంతగా ఆలోచనకు అందకుండా చలిస్తున్నది
మేధస్సుకు తెలియకనే జ్ఞానేంద్రియాల ప్రభావంతో ఎక్కడికో ప్రయాణిస్తూ
ఏ క్షణం ఎక్కడ ఉంటుందో ఎంత దూరం వెల్లుతుందో తనకు సరిగా తెలియక
ఆలోచన ఏకాగ్రతతో పట్టుకుంటే తప్ప దొరకనంతగా వివిధ రకాలుగా చలిస్తూనే
ఆశ చూపిస్తేనే మనతో ఉంటుందని లేదంటే మరల ఎక్కడెక్కడికో అన్వేషిస్తూనే
దేనిని ఆశిస్తుందో గాని విజ్ఞాన అజ్ఞాన భావాలతో సతమతమవుతూ జీవిస్తూనే
జీవించినంత కాలం మనతో ఉంటూ మనల్ని జీవింపజేస్తూ జీవితమంతా తోడుగా
మనస్సు లేకపోతే మనలో చలనం లేనట్లు శరీరాన్ని కదిలించే శక్తిగా శ్వాసతో
మనస్సుతో ఆలోచనలు వెల్లుతున్నందున మేధస్సును పని చేయించేలా
మనస్సుతో ఆలోచనలు వెల్లితేనే విజ్ఞానం తెలుసుకోవచ్చు అజ్ఞానాన్ని తొలగించవచ్చు
మనస్సును అదుపులో ఉంచుకోవాలి లేదంటే ఎక్కడికి వెల్లుతుందో తెలియని అజ్ఞానంగా
కాలంతో ముందుకు సాగే మర్మమే మనస్సుకు ఉన్నందున ఆలోచనలు వస్తున్నాయి
మనస్సు మారకపోతే ఆలోచనలు మారక మేధస్సు పనిచేయక మతి స్థిమితంతో
క్షణానికి ఎన్ని ఆలోచనలు వస్తాయో అంతకన్నా ఎక్కువ స్వభావాలతో మనస్సు మారుతూ
మేధస్సులో జరిగే ప్రతి సూక్ష్మ క్రియాలోచన మనస్సుతో కూడినదేనని నా ఆలోచన
మనలో ఏ భావము కలిగన మనస్సు తెలిపే విధానమే విజ్ఞాన ఆలోచనగా తెలిసేలా
No comments:
Post a Comment