సమాజాన్ని మార్చాలని ఎందరికి ఉన్నది
సమాజం మారాలని అనుకున్న వారు ఎందరు
మీరంతా సమాజం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు
సహాయం చేసిన వారు మళ్ళీ ఇక సహాయం చేయనవసరం లేదా
ఇక కాల ప్రభావాలు ఎలా సంభవించినా మీరు సహాయం చేయరా
మళ్ళీ సహాయం చేస్తే ఇంకా ఎన్ని సార్లు సహాయం చేస్తుంటారు
ఇక వారి జీవితంలో ఏ లోటుపాట్లు కలగవా ఎవరిని సహాయం అడగరా
ఒక్క సారి సహాయం పొందితే ఇక వారికి ఏ ఇబ్బందులు కలగవా
అందరు సుఖ సంతోషాలతో జీవించాలని ఎవరికి ఉన్నది
మీరు మాత్రమే మీ గురించే ప్రతి రోజు ఆలోచిస్తూ జీవిస్తున్నారు
చిన్న చిన్న సమస్యలనే ఆలోచిస్తూ మాట్లాడుతూ జీవిస్తున్నారా
మీ పాతికేళ్ళ విజ్ఞాన వయసులో ఏ పరిష్కారాన్ని ఆలోచించారు
సమాజాన్ని ఎలా మార్చాలని అనుకున్నారు గ్రహించండి
మనం శ్రమిస్తూ జీవిస్తున్నా కొందరు ఆర్థికంగా ఎదుగుతున్నారు
ఒకే మనిషికి వేల కోట్ల ధనం అవసరమా మనకెందుకు లేదు
సమాజం ఇలా సాగిపోతే మన తరతరాలు ఇలాంటి పరిస్థితులతోనే
ఆలోచించి ముందుకు సాగండి నా విశ్వ ప్రణాళికను గమనించండి
/ * Universal Procedure : Government / చదవండి
No comments:
Post a Comment