Thursday, February 24, 2011

ఓ ప్రభుత్వమా! ప్రతి రోజు అందరికి

ఓ ప్రభుత్వమా! ప్రతి రోజు అందరికి ఆహారం అందుతుందా ఆకలి తీరుతుందా
పేదవారికి పని కలుగుతున్నదా ప్రతి రోజు ఆకలి తీరుతున్నదా గమనించు
ప్రతి రోజు నిద్రపోయే వేళ అందరికి ఆహారం అందిందా అందరూ నిద్రపోతున్నారా
ప్రతి రోజు మేల్కొనే వేళ అందరికి పని కలుగుతున్నదా అందరూ ఆరోగ్యంగా ఉన్నారా
ప్రతి రోజు ఎవరికి ఆకలి తీరలేదు ఎవరికి అనారోగ్యం కలిగినది ఎవరికి పని కలగలేదు
ఇలా ప్రతి రోజు ఆలోచిస్తే ఉదయం నుండి రాత్రి వరకు ఏమి చేయాలో తెలుస్తుంది
ప్రతి ఒక్కరి క్షేమమే ప్రజా సేవా ప్రజా కార్యం ప్రజా జ్ఞానం ప్రజా కీర్తి ప్రజా గుణం
నాలో ఓ ప్రణాళిక ఉంది అమలు చేయగలరా ఆలోచించి మేధావులతో చర్చించండి
జీవించే వారికోసం కాదు ఎవరైతే జీవించలేక పోతున్నారో వారికోసమే నా ప్రణాళిక
ధనవంతులకు కాదు మేధావులకు కాదు ఆహార నిద్రలు లేనివారికే నా 'ప్రాణా'ళిక
ఎక్కడో అద్భుతాలను చూసి ఆశ్చర్య పోవడం కన్నా ఒకరికి ఆహార నిద్రలు అందించడమే విజ్ఞానం

No comments:

Post a Comment