ఆకలి నిద్రకు కరువయ్యే మేధస్సులతో జీవిస్తున్నా
పగలంతా ఆహారంకై అన్వేషించినా ఆకలి తీరలేదు
రాత్రంతా నిద్రను అన్వేషించినా మేధస్సు నిద్రించలేదు
సరైనా ఆహారం లేక సరైనా వసతి లేక సరికాని జీవితం
ఒక రోజైతే ఆలోచించగలం జీవితమంతా ఇలాగే ఉంటే ఏం చేయాలి
మనస్సు స్పందించినా మేధస్సులో విజ్ఞానం చలించకపోతే ఎలా
అందరికి పనితో పాటు ఆహరం వివిధ సౌకర్యాలు అందేలా పరిష్కారాన్ని ఆలోచించుదాం
నాలో ఓ మహా గొప్ప ప్రణాళిక ఉంది ఎవరు అమలు చేయగలరో ఎదురుచూస్తున్నా
మనస్సుతో కాదు మహా విజ్ఞాన మేధస్సుతో ఆలోచించి కదలిరండి పేదవారికై
No comments:
Post a Comment