Friday, February 25, 2011

సమాజాన్ని మార్చడమే నా

సమాజాన్ని మార్చడమే నా విశ్వ కార్యంగా అనుకున్నా
ప్రతి జీవికి మంచి భవిష్య విజ్ఞానాన్ని అందించాలనుకున్నా
నేను ఓ పేదవాడిగా ఆలోచిస్తూ విశ్వ ప్రణాళికను ఏర్పాటు చేశా
సమాజాన్ని చూస్తూ సమాజంలో జీవిస్తూ సమాజ తీరును మార్చాలనుకున్నా
సమస్యలు అజ్ఞానంగా వస్తున్నాయి పరిష్కారాలు చాలా ఆర్థికంగా ఉన్నాయి
మోసపోవడమే సమాజంగా కనిపిస్తున్నది శ్రమించినదంతా వృధాయే
సరైన ఆహారం తినక నిద్రపోక శ్రమిస్తూ సంపాదించినదంతా ఇంకొకరికి లాభదాయకం
రేపటి భవిష్యత్ పేదవారికి లేదని నేడు ఆకలి నిద్రల ఆలోచనలతో కాలం గడుపుతున్నాడు
మేలు చేయడానికి పోతే మెడలు వంచేస్తారేమో నేటి సమాజ స్థితి విధానమున
నా విశ్వ ప్రణాళికను గమనించండి అందరికి మంచి జీవితాలు వస్తాయి

No comments:

Post a Comment