నీవు తీసుకునే నిర్ణయంలోనే ఆలోచనల కార్య శక్తి కలుగుతుంది
ఆలోచనలు మారినా నీ నిర్ణయం మారుతూ కార్య శక్తి తగ్గుతుంది
ఆలోచనల భావాలు ధృడంగా ఉంటేనే కార్యాన్ని శక్తి వంతంగా సాగించగలం
సంకల్పం లేని భావాలతో కార్యాలను ముందుకు నడిపించలేము
మనలో శక్తి రావాలన్నా ఆలోచనలలో కార్య నిర్ణయం ధృడంగా ఉండాలి
మహా కార్యాలను సాగించాలంటే ఎంతటి ధృడ సంకల్ప శక్తి కావాలో
ప్రతి చిన్న కార్యానికి ఆలోచన శక్తి ఉంటేనే మహా కార్యాలు సాగుతాయి
మహా కార్యాలు కొన్ని సంవత్సరాలుగా సంకల్ప శక్తితో సాగిపోతాయి
No comments:
Post a Comment