రహస్యమంటే ప్రశ్నగా తెలిసినది సమాధానం తెలియనిది
మర్మమంటే ప్రశ్నగా కూడా తెలియనిది ఎవరికి తోచనిది
విశ్వ రహస్యాలు చాలా వరకు మర్మంగానే ఉంటాయి
విశ్వాన్ని అన్వేషించే సమయంలో కలిగే ప్రశ్న కూడా మర్మంగా ఉంటుంది
ప్రశ్నలో సమాధానం ఎవరికి తెలిసి ఉండదు గ్రహించలేము ప్రశ్నే అర్థం కాదు
అలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మర్మాన్ని గ్రహించాలి
రహస్యం అంటే కొందరికి తెలిసి ఉంటుంది లేదా ఎక్కడైనా వ్రాసి దాచి ఉంటారు
ఉన్న దానిని కొందరికి తెలిసిన దానిని ఇతరులకు తెలియకుండా భద్ర పరచి ఉండడం రహస్యం
ఎవరికి తెలియని దానిని ఒకరికి కూడా తెలియనట్లుగా చెప్పలేనిది గ్రహించలేనిదే మర్మం
ఒకరి మేధస్సు విజ్ఞానం ఇంకొకరికి రహస్యం లేదా మర్మం అని చెప్పవచ్చు
ఉదాహరణ : ఒక యంత్రం పని చేసే విధానం తెలియకపోవడం రహస్యం
యంత్రమంటేనే తెలియక పోవడం మర్మం
No comments:
Post a Comment