Monday, February 14, 2011

నీవు చూసే లోక జ్ఞానం ఒకే దృష్టితో

నీవు చూసే లోక జ్ఞానం ఒకే దృష్టితో ఒకే దిక్కున గ్రహించినదే
నీకు కనిపించని తెలియని దిక్కుల కాల జ్ఞానం నీలో చేరదు
నీలో చేరని జ్ఞానంకై మళ్ళీ నీవు విజ్ఞాన అన్వేషణ చేస్తావు
ఈ అన్వేషణలో మళ్ళీ గత విజ్ఞానాన్నే అన్వేషిస్తే వర్తమానం తెలియదు
వర్త మాన విజ్ఞానాన్నే పూర్తిగా తెలుసుకోలేక గతాన్ని సరిగ్గా తెలుసుకోలేక
భవిష్య కాలానికి ఏదో చేయాలని పరుగులు తీస్తావు ఏ అనుభవం లేకనే
గత కాల వర్త మాన భవిష్య కాల విజ్ఞానాన్ని గ్రహిస్తూ లోకాన్ని అన్ని వైపులా చూస్తూ
ప్రతి విజ్ఞానం నీలో కలిగేలా చేరేలా దివ్య మేధస్సును సూర్యునిలా ప్రకాశింప జేసుకో

No comments:

Post a Comment