నేడు అలంకరించిన వస్తువులు పుష్పాలు రేపటికి ఎక్కడ ఎలా చేరుతాయి
గొప్పగా అలంకరించినవన్నీ రేపటికి అలాగే ఉంటాయా కలుషితమౌతాయా
దేనిని అలంకరించినా శుభ్రత కోసమే నిత్య పవిత్రత కోసమే పరిశుద్దత కోసమే
పుష్పాలంకరణ కన్నా పూల తొట్టీల అలంకరణ గొప్పదని నా భావన
రేపటికి పుష్పాలు మళ్ళీ పూస్తాయి కలుషితం ఉండదు ప్రాణ వాయువు లభిస్తుంది
పుష్పాలు జీవిత కాలమంతా మొక్కలతోనే గడుపుతూ స్వచ్ఛమైన సువాసనను ఇస్తుంది
రాలిపోయిన పూలు మళ్ళీ ఎరువుగా పూల తొట్టీలలోనే నశిస్తాయి గమనించారా
మహా ఆలోచన భావాలంటే ఇలాగే ఉంటాయి ఇలాగే అన్నింటిని గమనిస్తూ గ్రహించండి
మహాత్ముల మేధస్సు అవసరం లేదు మహా విశ్వ శాస్త్రీయ విజ్ఞానం కాదు అవగాహనయే
మీలో ఎంతవరకు జ్ఞాపక శక్తి ఉంటుందో మీరే పరీక్షించుకోండి విశ్వ విజ్ఞానంతో
No comments:
Post a Comment