నిద్ర లోనే నిద్ర లేదు మరి నిద్ర ఎలా
నిద్రించుటలో కలలు ఆలోచనలే వస్తున్నాయి
నిద్రలో జరిగేవన్నీ గుర్తుగానే ఉన్నాయి
గుర్తులేని కాల సమయం నిద్రలో లేనట్లు గుర్తున్నది
అన్నింటిని గమనిస్తున్నా అన్నీ తెలుసుకుంటున్నా
నిద్రలో ఏదీ గుర్తు రాక ఏ కలలు లేక మరచిపోయినట్లే ఉండాలి
అన్నీ తెలిసిన ధ్యాసలోనే తెలుస్తుంటే తెలియని పర ధ్యాస కలగదే
పర ధ్యాసలో ఏవీ తెలియకపోతేనే మంచి నిద్రగా చెప్పవచ్చు
నిద్రలోనే నిద్ర లేదు మరి ఏమున్నదో తెలియునా
నిద్రలోనే నిద్ర ఉన్నది ఎలా ఉన్నదో మర్మమే
గుర్తుంటే ధ్యాస నిద్ర లేని మహా ధ్యాస
గుర్తు లేకపోతే పర ధ్యాస నిద్ర కలిగిన ధ్యాస
No comments:
Post a Comment