దొరకునా ఇటువంటి ఆధ్యాత్మ భావన
భాగ్యము లేనిదే కలుగునా విశ్వ వేదన
మరుపు లేకనే తోచును మేధస్సుకు
ఇటువంటి మహా విజ్ఞాన జీవత్వ భావన
జీవితములెన్నో జన్మలుగా యుగాలతో సాగినా దొరకదే భావన
జన్మకు మహా రూప విశ్వ విజ్ఞాన భావన ఉంటేనే ఈ విశ్వ వేదన
ఇటువంటి వేదాంత ఆధ్యాత్మ భావన ఏ లోకమున ఎవరికి కలగదే
మహర్షులకైనా మహాత్ములకైనా మహా విజ్ఞానులకైనా కలగదే
విశ్వ విజ్ఞాన అన్వేషణ లోనే దొరకును ఇటువంటి ఆధ్యాత్మ భావన
"విశ్వమే నీకు సేవ చేయునని విశ్వాత్మగా నీకు కలిగినది ఆ వేదన"
No comments:
Post a Comment