అజ్ఞానాన్ని ఎందుకు వినిపిస్తున్నావు ఎలా వినిపించగలుగుతున్నావు
నీవు మాట్లాడే ధోరణిలో నీకు తెలియుట లేదా నీ స్వరం ఆపుట లేదా
నీవు మాట్లాడే పదాల అర్థం నీ విచక్షణ మేధస్సుకు తెలియుట లేదా
తెలిసినా తెలియకున్నా మాట్లాడుతున్నావా ఇక పదాలకు అర్థం ఎందుకు
నీవు మాట్లాడే పదాలకు నాలుక పలుకుతున్నా నా చెవులు ఆపేస్తున్నాయి
కనీసం ఏవి ఎక్కడ ఎలా మాట్లాడో తెలియకపోతే జీవితం ఎందుకు
ముసలివాడివి కావస్తున్నావు ఇంకా విచక్షణ జ్ఞానం కలగకపోతే ఆలోచించలేవా
కనీసం చుట్టు ప్రక్కల ఉండే వారిని చూసి మాటలను మార్చుకోలేవా
నీ మాటలకు చిన్న పిల్లలు కూడా అలాగే మాట్లాడుతూ సమాజం చెడిపోతున్నది
మాటలతో పాటు దురలవాట్లు వింత చేష్టలు వికృత రూప నడవడి మారిపో
సమాజంలో నిన్ను వెలివేసే కాలం వస్తుంది ఆలోచించి విజ్ఞానంగా జీవించు
No comments:
Post a Comment