ఓ విశ్వజీవి నీవే చిరంజీవి నీదే విశ్వ సమాజం నీ కోసమే జనులు
విశ్వ విజ్ఞానంతో సాగిపో కాలమే నీకు సరైన మార్గాన్ని చూపుతుంది
ప్రతి కార్యంలో సమయ స్పూర్తి అనుభవ విజ్ఞానం సమయాలోచన ఉండాలి
మనస్సు ప్రశాంతంగా ఉంటే మేధస్సులో మహా గొప్ప ఆలోచనలు కలుగుతాయి
మన ఆలోచనలకు దివ్య సూచనలను మహాత్ములు మహర్షులు అందిస్తూ ఉంటారు
విజ్ఞానమే ధైర్యం : ధైర్యమే విశ్వ కార్యం : కార్య కృషియే విజయం : విజయమే సమాజం
మనం గమనించ వలసినది సూక్ష్మ పొరపాట్లు ఎక్కడ ఏ స్థాయిలో జరుగుతాయోనని
సూక్ష్మ పొరపాట్లు లేని హిత భావాల విజ్ఞాన కార్యాలే మనల్ని ముందుకు యుగాలుగా సాగనిస్తాయి
కాల ప్రభావాలను ఋతు పవనాలతో ముందుగానే గమనించు ప్రజలను రక్షించు
కనీస అవసరాల సౌకర్యాలతో విజ్ఞానాన్ని అందించేందుకు ప్రజలలో జీవించు
* క్రమ కార్య కారణం గల నిర్దిష్ట ప్రణాళికలే విశ్వ జీవుల భవిష్యత్ సోపానము
/యుగాలుగా సాగేందుకే చిరంజీవిగా నీవు ఉదయించావు నీకు అస్తమించే శక్తి లేదు/
నాలో ఉన్నాయి సమస్యల కార్య భావాలు అందుకే అన్వేషించాను పరిష్కార స్వభావాలను
నేను జీవిస్తాను విశ్వ తత్వాలతో నాకు నేనుగా సాగిపోతాను విశ్వ కాలంతో విజ్ఞానిగా
No comments:
Post a Comment