మేధస్సు ఆలోచించటానికి ఆహారం లేకపోతే నిద్ర కూడా కలగటం లేదు
శక్తి లేక ఆహారం లేక నిద్ర కలగక సమాజంలో ఎందరో జీవిస్తున్నారు
రోజులు గడిచే కొద్ది శరీర స్థితి మారుతూ మేధస్సు వికటించిపోతున్నది
నేటి సమాజంలో మీరు చూడలేని మానవ దేహాల పరిస్థితి ఇదే కదా
వీరికి సరైనది ఒక్కటి కూడా లభించదు బాగా గమనించండి
ఆహార నిద్ర వసతి సౌకర్యాలతో స్నేహం శత్రువు బంధం ఏది ఉండదు
విశ్వాన్ని కూడా చూడలేని మేధస్సు స్థితితో జీవిస్తున్నారు
ప్రాణం పోతుందనే ఆలోచన జీవిస్తున్నామా అనే భావన వీరిలో లేదు
చుటూ ఉన్న ప్రదేశం కూడా ఎలాగ ఉన్నదో తెలియని పరిస్థితి
సమాజంలో సరైన విధానం లేకనే ఇలా ఎన్నో జరుగుతున్నాయి
నాలో ఓ విశ్వ ప్రణాళిక ఉన్నది మీరు గమనించి చెప్పగలరా
సమాజానికి అవసరమవుతుందో లేదో మేధావులతో చర్చించి తెలుపగలరా
No comments:
Post a Comment