భాష తెలియని రాని వయసులో చిన్నారులకు అజ్ఞానం లేదు విజ్ఞానం తెలియదు
మాటలు రాని వయసున మనస్సులో కల్ముషం లేదు దేహంలో భేదాలు లేవు
ఎదిగే కొద్ది ఎన్నో తెలుస్తున్నా ఏది హితమో తెలుసుకోలేని స్థితి మేధస్సులో
అందరితో పాటు జీవిస్తాము అందరిలాగే ఆలోచిస్తాము అదే విజ్ఞానమని భావిస్తాం
విజ్ఞానంగా తలచినది సరైనదేనానని గమనించేందుకు సత్యాన్ని గ్రహించాలి
సత్యమే విజ్ఞానము అదే గ్రంధము ఎప్పటికి నిలిచే సమానత్వ భావ స్వభావము
No comments:
Post a Comment