నీవు యోగివని తెలియదా తెలుసుకోలేదా తెలుసుకోవాలని లేదా
యోగివని ఏనాడు గ్రహించ లేదా ఆ భావన ఎప్పుడూ కలగ లేదా
నీవు యోగి కావాలని ప్రయత్నించ లేదా అయ్యేందుకు ప్రయత్నిస్తున్నావా
ప్రయత్నించినా యోగి భావాలు కలుగుట లేదా కావాలని ఉందా
నీవు ఎలా ప్రయత్నించావు ఏ భావాలతో నీవు ధ్యానిస్తున్నావు
నీ సాధన ప్రతి రోజు ఎంత కాలం ఏ ఏకాగ్రతతో ఎక్కడ సాగుతుంది
నీలో ఏ భావాలు కలుగుతున్నాయి వాటి అర్థాలను పరిశీలిస్తున్నావా
నీలో నీవే విశ్వాన్ని ప్రకృతి భావ స్వభావ తత్వాలను గమనిస్తున్నావా
నీవు జీవించుటలో దేనిని గ్రహిస్తున్నావు దేనిని అన్వేషిస్తున్నావు
నీ జీవిత జీవన కార్యాలు ఏమిటి ఎంతటి పవిత్రమైనవి గమనించు
నీలో విశ్వార్థ సద్గుణ భావాలు కలుగుతుంటే యోగిగా జీవిస్తున్నట్లే
No comments:
Post a Comment