Monday, February 7, 2011

అక్షర రూపాన్ని చూస్తేనే కదా

అక్షర రూపాన్ని చూస్తేనే కదా ఏ అక్షరమో తెలిసేది
అక్షరాన్ని దిద్దాలి వ్రాయాలి గుర్తించాలి జ్ఞాపకం పెట్టుకోవాలి
ఏ భాష అక్షర రూపమైనా తెలుసుకొనుటకు ఇలాగే నేర్చుకోవాలి
ఎన్ని రకాలుగా తెలుసుకుంటే అన్ని రకాలుగా విజ్ఞానం వస్తుంది
వ్రాయడం(దిద్దడం) పలకడం(చదవటం మాట్లాడటం చెప్పటం) ఇలా ఎన్నో విధాల
ఎన్ని రకాలుగా నేర్చుకుంటే అంత గొప్పగా భాషా వ్యాకరణ ప్రావిణ్యం కలుగును
బహు భాషలు నేర్చుకుంటే అవధానిగా బహు భాష కోవిదుడిగా ఎదగవచ్చు
బహు భాషలతో ఇతర ప్రాంతపు వారి పరిచయాలు స్నేహంగా మారుతాయి
బహు భాషలతో విజ్ఞానాన్ని తెలుసుకొని ఉన్నత శిఖరాలను అధిగమించవచ్చు
అక్షరం నుండి మహా విజ్ఞానం వరకు మీ మేధస్సు జ్ఞాపకంగా ఎదుగుతుంది
అక్షరంలోని అర్థాలు తెలియాలి అక్షర పదాల ఉపయోగాన్ని తెలుసుకోవాలి
ఎక్కడ ఏ పదాలు పలకాలో విజ్ఞాన సత్యాన్ని తెలుసుకొని ఉండాలి
మాట ముఖ్యం పదాలు జారితే మనిషిలోని అజ్ఞాన గుణాలు తెలిసిపోతాయి

No comments:

Post a Comment