మనం జన్మించేటప్పుడు మనకు ఏదీ తెలియదు అంతా శూన్యం
ఆకాశం ఉందని చాలా విశాలమైనదని సూర్య చంద్రులున్నారని
నక్షత్రాలు ఉన్నాయని మేఘాలు ఏర్పడుతూ వర్షాలు కురుస్తాయని
పంచ భూతాలతో ప్రకృతి మన శరీరం నిర్మాణమై ఉందని ఏదీ తెలియదు
అంతా ఎదుగుతూనే నేర్చుకోవాలి ఎందుకో ఈ విజ్ఞాన విధానము
శూన్యం నుండి అణువణువునా విశ్వ విజ్ఞానం తెలిసే వరకు ఎదగాలి
విశ్వ విజ్ఞానాన్ని గ్రహించుటలో ఎన్నో సమస్యలు జీవన విధానాలు
ఆధ్యాత్మ జీవితంతో జీవించే వరకు మనకు అర్థం కాని సమస్యలే
జీవించరా విశ్వ జీవి బ్రంహాండాన్ని విశ్వ విజ్ఞానంతో తిలకించి అస్తమించు
No comments:
Post a Comment