Sunday, February 6, 2011

విశ్వమున వెళ్ళిపోయినా మేఘాలు

విశ్వమున వెళ్ళిపోయిన మేఘాలు మళ్ళీ రానివి మీరు చూడలేని అద్భుత రూపాలవి
అణువణువునా కలసి ఏర్పడినవి మళ్ళీ అణువణువునా విడిపోయి వెళ్ళిపోయినా మేఘాలవి
కొన్ని వర్షంగా కరిగిన రూపాలు కొన్ని సూర్య కిరణాలకు మెరిసిన అద్భుత వర్ణ మేఘాలు
మేఘాలలోనే ఎన్నో పొరలుగా ఎన్నో లోకాలుగా నిర్మితమై ఎన్నో అద్భుతాలను చూపిస్తుంది
ఎన్ని రూపాలు వెలిసినా క్షణాలకు మారుతూనే మళ్ళీ ఆకాశాన్ని శూన్యం చేసిన రూపాలవి
మేఘాలలో గొప్పదనం ప్రయాణమే ప్రయాణాలలో ఎన్నో వింతలు రూపాలు అద్భుతాలు
చంద్రుడు కూడా మేఘాలతో ప్రయాణించేలా ఎన్నో గొప్ప భావాలను కలిగిస్తూనే ఉంటాయి
సూర్యునికి అడ్డుగా వచ్చి నీడను ఇస్తుంది కిరణాలను గొప్పగా వివిధ తేజస్సులతో చూపిస్తుంది
మేఘాలలోనే అనంతమైన వర్ణ తేజస్సులు మెరుపులు పిడుగులు ఉరుములు ఉన్నాయి

No comments:

Post a Comment