Thursday, January 28, 2010

2012 - " కలి యుగాంతం "

కలియుగం అంతం కావడానికి నేడు సంభవిస్తున్న జల భూప్రకంపనాల ప్రకృతి స్వభావములే కారణమా -
జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి ఘోర ప్రళయాలుగా నేటి యుగానికి ముగింపు నిదర్శనాలేనా -
ప్రకృతిని సైతం తాండవించే మహాప్రళయాలు దిక్కులే తెలియనివిధంగా ఎక్కడినుండో విస్పోటనం చెందగలవు -
కోట్లలో జల జీవ జంతు మానవులంతా కలసికట్టుగా మరణించ వచ్చని నాలో వేదనాలోచనలు కల్గుతున్నాయి -
అంగ వైకల్యముతో పోరాడుతూ కొన శ్వాసతో ఆశించగల జీవన ప్రళయ వేదనలు నన్ను హెచ్చరిస్తున్నాయి -
ప్రళయాలకు ముందుగానే ఎందరో విజ్ఞానశాస్త్రవేత్తలు సృష్టి ప్రభావాలను కొంతమేరకు పరిశీలించి జాగ్రత్త పడవచ్చేమో -
శబ్ద జల వాయు కాలుష్యాలను తగ్గించి చెట్లను పెంచగల్గితే ప్రకృతి ప్రభావాలతో కొంత మేరకు ప్రళయాలను తగ్గించవచ్చునే -
ఏ భూ జల ప్రదేశాలలో ప్రకృతి వైపరిత్యాలు సంభవించునని మనకు అనుభవ పూర్వకంగా తోచునో గుర్తించండి -
సంభవించగల ప్రదేశాలలో తగిన చర్యలు అందుకు కావలసిన వస్తువులు సదుపాయాలు లేదా వలస వెళ్ళటమే -
నగరములే కాక రాష్ట్ర దేశాలు కూడా వలస వెళ్ళుటకు సిద్ధంగా ఉండవలెనని ఏ యుగాన్తమునైనా నా సూచనగానే -
నేను ఎంత తెలిపినను వివరించినను ఎవరి జాగ్రతలు వారి ప్రాణ రక్షణములకు అవసరమయ్యే అనుభవాన్ని సేకరించడం -
ఏ సమస్యకైనా ఎవరికైనా ఏ క్షణమైనా ఎంతవారైనా ఎటువంటి పరిస్థితి ఐనా "శాంతి" గా ఆలోచిస్తూ పరిశ్కారించుకోండి -
కలియుగానికి ముగింపు పదమే "శాంతి" అని కలియుగాన్ని శాంతియుగంగా ముగిస్తూ మరో కొత్త యుగానికి ఆహ్వానం పలుకుదాం -
శాంతి అనే మాటను బలపరిస్తే కలియుగాన్తమునైనా మన దేశం శాంతిమయంగా ఉండగలదని జగతిలో అన్వేషించి చూశా -
ఎవరి ప్రయత్నమున వారే ఒక సత్య భావనను ధృడపరచి ప్రళయాలలో సద్గుణ ప్రవర్తన రావాలని కోరుకుందాం -
ప్రళయాలు సత్ ప్రవర్తన చెంది నవ ఋతుపవనాలుగానే సమకూరాలని జగతిలోని జీవములు పరమాత్మను కోరగా -
ఈ యుగాంతమునకు కొన్ని దశాబ్దాలుగా ఎందరో మహానుభావులు ఒక దివ్యశక్తి తత్వముగల ధ్యానమును ప్రబోదిస్తున్నారు -
ధ్యానమే పరమాత్మ స్వభావముగా మన శ్వాసయే ఆత్మజ్ఞాన ప్రజ్ఞానమై సకల సమస్యలకు సత్య మార్గమును చూపుతున్నది -
పరిశుద్ధమైన ఆత్మతో ధ్యానించు ప్రాంతమున ప్రళయాలు తక్కువ ప్రభావాలు చూపగలవని ప్రకృతిలో ఉన్న భావము -

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete