క్షణము తెలిస్తే గాని మొదటి క్షణమును ఆలోచిస్తూ క్షణము కన్నా ముందుగా యేమని తలచగా ఎంతో కాలంగా పరిశీలించి నే గ్రహించినదే శూన్యమని -
క్షణకాల సమయము తెలియక క్షణమును గుర్తించలేక ఆనాటి కాల జ్ఞానమున మొదటి క్షణమును ఆలోచించలేక శూన్యమును చేరుకోలేక పోయారు -
నేడు గడిచిపోతున్న క్షణములతోనే మరో క్షణములుగా సాగే ఏవో సమస్యాలోచనలతో ముందుకు సాగుతున్నారేగాని మొదటి క్షణాన్ని ఎవరూ ఆలోచించలేదు -
కొంతసమయాన్ని క్షణముగా గుర్తించినను మరో క్షణములుగా ముందుకు వెళ్లుతున్నారే గాని క్షణము తెలియక గడిచిన గత కాలమెంతో నేటికి తెలియుటలేదు -
గతమున గడిచిన కాలమున క్షణమును ఇంకా ముందుగానే కనుగొని ఉంటె కొంత కాలమునకు గడిచిన క్షణాలను కొన్నిరోజుల సమయంగా తెలుసుకో గలిగేవారు -
క్షణమును కనుగొన్న వారు లేకుంటే నేను విశ్వ కాలమునకు ముందు శూన్యమేనని గ్రహించలేక పోగలనేమోనని నేడు ఓ క్షణాన తెలుసుకోగల్గుతున్నాను -
క్షణమును కనుగొన్నందుకే ఎన్నో సమయాలోచనలను చేస్తూ ఎంతో అభివృద్ధిని సాధిస్తూ క్షణములకే ఎన్నో కార్యాలను చేసుకుంటూ అద్భుతాలతో ముందుకెళ్ళుతున్నాం -
క్షణమును కనుగొనక ముందే ఎందరో తెలియకుండానే ఆనాటి జ్ఞానమున ఆ కాలమునందే మరణించారు కనుగొన్న తర్వాత కూడా సమాచార ప్రసారంలేక మరణించినవారెందరో -
క్షణముల కాలము తెలియకుండా ఆనాటి కాలమున ఒకరితో కలసిన మరొకరు ఎంత సమయం మాట్లాడుటకు కేటాయించెదరో ఇలా ఎన్నెన్నో ఆలోచిస్తేనే అనంతం ఐనా నాలో ఉన్నాయి -
క్షణమును కనుగొన్నవారు యింతే సమయమని ఈ సమయ కాలమే క్షణమని ఇతరులకు అర్థమయ్యేటట్లు క్షణ కాల సమయమును ఎలా ఎందరికి ఎంత కాలం వివరించారో -
క్షణమును కనుగొనుటకు ఆ కాలసమయం ఎంతపట్టిందో ఎందరికి అవగాహన వచ్చిందో క్షణమును మరో క్షణాలుగా నిమిషాల గంటల రోజులుగా అదే క్షణ కాల సమయాన్ని యుగాలుగా -
విశ్వమునకు ముందు శూన్యమని ఎందరికో తెలుసు ఐనా అది ఎక్కడిది ఏనాటిదని తెలియక నే క్షణముతో ఆలోచించగా నా అన్వేషణలో మొదటి క్షణమునకు ముందుగా గ్రహించాను శూన్యాన్ని -
శూన్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా నా ఆలోచనభావన ధారలో విశ్వ జగతి మొదటి క్షణం నుండి ఎలా ఏర్పడిందో నాకు తెలిసిపోయినట్లుగా తెలిసిపోయింది నేటి వరకు "క్షణం - అంతా తెలిసిపోయేనా" -
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete