Friday, January 22, 2010

తిరుమల ఏడుకొండలలో

తిరుమల ఏడుకొండలలో దాగిన రూపం నేనైతే నా భావ స్వరూపాన్ని విశ్వం తిలకిస్తే -
ఏడుకొండలు కలసిన మధ్య భాగాన్ని మోహన త్రినేత్ర తేజస్సుతో దివ్య ప్రభావాలతో -
నక్షత్ర ప్రకాశములతో మెరుగు పరచి మహా లోకములు చూడలేనంతగా రూపమిచ్చి -
సృష్టిలోనే దివ్య శక్తులతో కూడిన అత్యంత ఉన్నతమైన ప్రదేశాన నిటారుగా నిలిపి -
ప్రకృతి పొరలలో వేకువజామున సన్నగా జారువాలే హిమబిందువులను శంఖమున సేకరించి -
సన్నని గాలి వీస్తున్న వేళ రూపానికి అంగుళం ఎత్తున శంఖపు నీటితో స్నాన పరచగా -
తేనీయ పంచామృతంతో కొబ్బరి నీటిని చిలకరించగా మేఘమలినములు వదిలి శుభ్రతతో -
ప్రతి పుష్ప సుమగంధ మనోహర సువాసనముల సంగీత స్వర మాధుర్య మంత్రములతో -
కోకిల కుహూ రాగ సమ్మేళనాలతో ఓంకార నాధములతో విచక్షనీయ గమన వినికిడితో -
సువర్ణ వజ్ర వైడూర్య నక్షత్ర ప్రకాశములతో కూడిన ఆభరణములను సునాయసంగా అలంకరించి -
నవ దివ్య గంధాల సాంబ్రాణి వేసి మై మరపించే సుమముగల కర్పూర హారతిని ఇవ్వగా -
పరమాత్మ జ్యోతితో జీవము కలుగునట్లు పరిశుద్ధ పరిపూర్ణ పవిత్ర ప్రజ్ఞాన సత్య భావముల -
సూర్యోదయ తొలికిరణాలు నేత్ర తాకిడితో చక్రదారిగా ఒక స్వప్నక్షణమున ప్రత్యక్షమయ్యెను -

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete