Saturday, January 30, 2010

సూర్యుని వెలుగు ఏలోకమున

సూర్యుని వెలుగు ఏలోకమున ఏప్రాంతమున చేరగలదో స్థానమున ఎటువంటి జీవి ఐనను జీవించగలదని భావన -
సూర్యుని కిరణాలలోని ప్రకాశవంతమైన సూక్ష్మశక్తి భూ జల పొరలలో కూడా కొన్నివేల అడుగులలో చేరుతుంది -
సూర్యుని వెలుగు ప్రభావాలలో కూడా జీవియొక్క ఆలోచనస్థితులు మారుతూ ప్రతి రోజూ వివిధరకాలుగా ఉంటుంది -
సూర్యుని వెలుగు ప్రభావాలకు ఆప్రాంతము ఒకశక్తితో ప్రశాంతమైనచోట మహాశక్తితో ఇలా ఎన్నోవిధాలుగా ఉంటుంది -
సూర్యుని యొక్క శక్తి ప్రభావాలకు కూడా సూర్యోదయాన విశ్వం నిద్రలేచినట్లు సూర్యాస్తమున నిద్రిస్తున్నట్లుగానే తోస్తుంది -
సూర్యుని యొక్క శక్తితోనే ప్రతి జీవికి ఒక భావన చలన్నాన్ని కలిగిస్తుంది ఉన్న స్థితిని మార్చేస్తూ మెలుకువనిస్తుంది -
సూర్యుడులేని సమయంలో కూడా మనలోని వచ్చే మెలుకువ భావనతో వచ్చిన స్థితి ఉత్తేజపరంగా లేక వేరే విధంగా తోస్తుంది -
సూర్యుడు ఉదయించే సమయంలో నిద్రలేస్తూ సరైన సమయంలో నిద్రపోతూ సూర్య సమయంలో పనులు చేసుకోగా ఆరోగ్య విజ్ఞాన జీవితశక్తియే -
విశ్వము యొక్క భావన తగ్గి పోకుండా ప్రతి రోజు దానికి కావలసిన ఉత్తేజశక్తిని సూర్యునితో అలాగే చంద్రుని ద్వార విశ్రాంతిని స్వీకరిస్తూ గాలితో శ్వాసగా చలనం చెందుతూ ఉంటుంది -

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete