Tuesday, January 5, 2010

సూర్యుడు ఉదయించిన మొదటి రోజేది

సూర్యుడు ఉదయించిన మొదటి రోజేది కిరణాలు తాకిన మొదటిది ఏది
ఉదయించిన క్షణమేది కిరణాలు తాకిన ప్రదేశం ఎక్కడిది ఎవరికి తెలియదులే -
సూర్యుడే లేని రోజులెన్ని ఆనాటి చీకటి వెలుగులు ఉన్నాయో లేవో ఎవరికి తెలుసు -
సూర్యుడు ఉదయించిన మొదటి రోజుకు ముందే సృష్టించబడినవి జగతిలో ఏవి ఎందుకు -
సూర్యుడు ఉదయించిన నాటి నుండి నేటికి గడిచిన రోజులు ఎవరికి తెలియవులే -
జగతిలో గడిచిపోతున్న సమయమంతా కాలానికి కూడా తెలియక నాలో నిలిచిందిలే -
ప్రతిరోజూ ఉదయించే సూర్యుడికి అలసటలేక సమయస్పూర్తి ఎన్ని రోజులవరకు ఉంటుందిలే -
ప్రతిరోజూ వెలుగుతో ఉదయిస్తూ కిరణాలతో శక్తినిస్తూ ప్రతిజీవికి మహాశక్తిగా వస్తున్నాడులే -
ప్రతిరోజూ సగం రోజునకు అస్తమిస్తూ చీకటితో కనబడక భూమికి ఒక వైపున వెల్లిపోతాడులే -
తను అస్తమిస్తూ కూడా చీకటిలో చంద్రున్ని వివిధ రూపాలుగా కాక ఎన్నో నక్షత్రాలను చూపిస్తాడులే -
తను రోజూ ప్రకృతిలో ఎన్నో మార్పులు చేస్తూ ప్రతిజీవికి ఎన్నోవిధాల అనుభవాన్ని కల్గిస్తుంటాడు -
ఉదయించే సూర్య కిరణాలను నది తీరాన స్నానాన్ని ముగిస్తూ చూడగా నీ కళ్ళలోనే విశ్వకాంతి -
సూర్యుడు ఉదయించిన మొదటి రోజు ప్రదేశమున నక్షత్రాలు చంద్రుడు హిమముగా పర్వతాలున్నాయి -

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete