Thursday, January 28, 2010

2013 - "ఆత్మ యుగం"

2012 వ సం,, తో కలియుగం అంతం ఐతే రాబోయే యుగమే "ఆత్మ యుగం" అని నా విశ్వభావమున ప్రఘాడ విశ్వాసం -

సరి కొత్త యుగానికి ఆత్మ అనే నామం ఎలా! కారణం ఏమిటి? కలియుగాంతమున అనుభవాల అర్థాన్ని ఆత్మగా ప్రస్తావించారా -
కలియుగాంతమున జరగబోవు ప్రళయాలను అనుభవ పూర్వకంగా చూస్తే ఎందరో కోట్లలో ఎక్కడెక్కడో వివిధరకాలుగా మరణించేదరని అంచనా -
కొన్ని ప్రదేశాలే జలమయ మైనట్లు వివిధ జీవములే ప్రళయాలతో పోరాడి తుది శ్వాసను కన్నీటితో ఎవరికి తెలియక జలమందే విడిచెను -
ఎంతో ఎదిగిన వారిని ఎదగలేని వారిని సత్యమైనా అసత్యమైనా ఒకే బంధముగా జల ప్రళయ భూ ప్రకంపనాలలో ఏది తోచనట్లు శ్వాస వదిలేరు -
సత్యభావముతో ధ్యానించినవారిని సైతం భయబ్రాంతులతో ఆత్మ కర్మానుసారముగా ప్రలయాలకు జలములో జీవమును వదులుకోవలసిందే -
ప్రళయ ప్రభావాలకు విష పూరిత రోగములు అంగవైకల్యము అనాధ స్థితులు పసి పిల్లలుగా ఆహార వస్త్ర వసతులు కోల్పోయి ఎవరికి ఎవరు తెలియనట్లే నా కన్నీటి ధార -
నేటి కాలమున సంభవించకున్నను రాబోయే యుగాలకు అనుభవ చరిత్ర ప్రళయ సూచన నిఘంటువులా శాస్త్రవేత్తల మేధస్సులో నా ఆలోచన దాగేనులే -
మరణించిన వారి ఆత్మలు మరో జన్మకై వేచి ఎక్కడ ఎలాంటి జన్మ పొందాలో తెలియక కొన్ని కోట్ల ఆత్మలు యమాత్మ లోకమున అజ్ఞానముగా వేచి ఉండెదరు -
ప్రతి ఆత్మ సరైన జన్మను జేవితాన్ని పొందుటకు కావలసినది ఆత్మజ్ఞానం అది ధ్యానముననే సాధ్యం అందుకే "ధ్యాన జగత్" గా ఆత్మతో అవతరిస్తున్నదే "ఆత్మ యుగం" -
ధ్యానమున కలిగే అధ్బుత ప్రభావాలు ఆత్మ జ్ఞానముతోనే తెలుసుకోగలరని ప్రతి జీవి సత్యంగా జీవంచగలదని నిత్యానంధమునకే నే తలచిన యుగ నామమే ఆత్మ -

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete