ఎందెందు వెతికినా అందందే గలడు ఎలా ఆ భావన ఎవరిది ఆ రూపం
మహా తత్వంచే కూడిన "పరమాత్మ" భావనతోనే విశ్వాన్ని సృష్టించాడు
పరమాత్మయే భావన "భావన" తో సృష్టించిన ప్రతి రూపానికి ఆత్మయే మూలం
ఆత్మ లేకుండా ఏ రూపమైనను ఆకారమైనను అణువైనను చలనమైనను లేదు
ఆత్మలతో నిండిన విశ్వం సంపూర్ణ తత్వంచే కూడినదే పరమాత్మ తత్వం
పర అనగా సంపూర్ణమైన మహా కలయిక "ఆత్మలన్నింటిని ఒకటిగా భావించుటయే" పరమాత్మ -
ఏ రూపాన్ని విడదీసిన ఎన్ని రకాలుగా ఎన్ని విధములుగా చేసినా ఆత్మలుగానే
సూక్ష్మములుగా విడదీయుటలో కూడా మరో ఆత్మలుగానే పరమాత్మ భావంతో విడిపోవును -
ఎన్నో ఆత్మల సముదాయముతో ఎన్నో రూపాలుగా విశ్వమంతా సృస్టించబడినవే
ఎందెందు వెతికినా అందందే గలదు ఆత్మ ఆ భావమే పరమాత్మ తత్వం
రూపమే లేని రూపముగా భావముగా ప్రతి ఆత్మలో ఎందెందో గలడు ఇక వెతుకుటయా
Welcome to Blogger "gsystime" to read my intent of informaton. //Spread Universal//
ReplyDelete